Chappal Holi : హోలీ రోజు అక్కడ చెప్పులతో కొట్టు కుంటారు

హోలీ పండుగ రోజు అందరూ రంగు నీళ్లు ఒకళ్ల మీద ఒకళ్లు జల్లుకుంటూ ఆనందోత్సాహలతో మునిగి తేలుతారు. కానీ ఒక చోట మాత్రం చెప్పులతో కొట్టకుంటారు. అదెక్కడో తెలుసా... బీహార్ లోని పాట్నాలో.

Chappal Holi : హోలీ రోజు అక్కడ చెప్పులతో కొట్టు కుంటారు

Patna Holi

Chappal Holi : హోలీ పండుగ రోజు అందరూ రంగు నీళ్లు ఒకళ్ల మీద ఒకళ్లు జల్లుకుంటూ ఆనందోత్సాహలతో మునిగి తేలుతారు. కానీ ఒక చోట మాత్రం చెప్పులతో కొట్టకుంటారు. అదెక్కడో తెలుసా… బీహార్ లోని పాట్నాలో.

దేశ  వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో హోలీ వేడుక‌లు నిన్న ఘ‌నంగా ప్రారంభం అయ్యాయి. ఈనేప‌థ్యంలో పాట్నాలో కూడా హోలీ వేడుక‌లు ఘ‌నంగా ప్రారంభం అయ్యాయి. అదే సమయంలో పాట్నాలోని వాట‌ర్ పార్క్‌లోకి వెళ్లిన స్థానికులు.. అక్క‌డ ఉన్న నీళ్ల‌ను రంగుల‌తో నింపేశారు. ఆ త‌ర్వాత ఇక ఆ నీళ్ల‌లోకి దిగి.. అంద‌రూ ఒక‌రిని మ‌రొక‌రు చెప్పుల‌తో కొట్టుకున్నారు.

ఎవ్వ‌రినీ వ‌ద‌ల‌కుండా.. ఏ చెప్పు దొరికితే ఆ చెప్పుతో ఎదుటి వాళ్లను బాదుతారు. ఇక‌.. చెప్పుల దెబ్బ‌లు తిన‌లేక కొంద‌రు అక్క‌డి నుంచి ప‌రిగెత్త‌డం.. వాళ్ల‌ను ప‌ట్టుకునేందుకు రంగులు క‌లిపిన నీళ్ల‌లో ప‌రిగెత్త‌డం.. నవ్వుతూ కేరింతలో జరిగే ఈతతంగం అంతా హోలీ వేడుకలో భాగ‌మే.
Also Read : Holi Telangana : హోలీ రంగ హోలీ.. చమ్మకేళిల హోలీ
అయితే.. చెడు మీద మంచిని జ‌యించిన సంద‌ర్భంగా రంగుల‌తో ఈ ఫెస్టివ‌ల్ జ‌రుపుకుంటారు కాబ‌ట్టి.. మ‌న‌లో ఉన్న చెడు కూడా పోవాల‌ని.. మ‌న‌లో మంచి ఉండాల‌ని చెప్పుల‌తో ఒక‌రిని మ‌రొక‌రు కొట్టుకుంటార‌ని అక్కడ హోలీ వేడుకల్లో పాల్గోన్న స్ధానికుడు ఒకరు తెలిపారు.