Bank Holidays : బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. మే లో 12 రోజులు సెలవులు

వచ్చే నెలలో(మే) మీకు బ్యాంక్‌లో ఏదైనా పనుందా? ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు చేయాల్సి ఉందా? అయితే కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. మే నెలలో బ్యాంకులు ఎప్పుడెప్పుడు పని చేయవో ఇప్పుడే తెలుసుకుంటే మంచిది. మే నెలలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.

Bank Holidays : బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. మే లో 12 రోజులు సెలవులు

Bank Holidays

Bank Holidays : వచ్చే నెలలో(మే) మీకు బ్యాంక్‌లో ఏదైనా పనుందా? ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు చేయాల్సి ఉందా? అయితే కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. మే నెలలో బ్యాంకులు ఎప్పుడెప్పుడు పని చేయవో ఇప్పుడే తెలుసుకుంటే మంచిది. మే నెలలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అంతేకాదు కోవిడ్ కారణంగా బ్యాంకింగ్ పని వేళలు తగ్గాయి. ఇలాంటి పరిస్థితుల్లో సెలవులకు, పని వేళలకు అనుగుణంగా బ్యాంక్ పనులు షెడ్యూల్ చేసుకుంటే ఇబ్బందులు ఉండవు.

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ప్రకారం.. మే నెలలో బ్యాంకులు 5 రోజులు పని చేయవు. అయితే అన్ని రాష్ట్రాల్లో ఇవే సెలవులు ఉండకపోవచ్చు. బ్యాంక్ హాలిడేస్ రాష్ట్రం ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. రాష్ట్రాల్లో స్పెషల్ ఫెస్టివల్స్ కూడా ఉండొచ్చు. అవి ఆ ఒక్క రాష్ట్రానికే పరిమితం కావొచ్చు. ఇలాంటప్పుడు అక్కడ బ్యాంకులు క్లోజ్‌లో ఉంటాయి.

* మే 1న మే డే(లేబర్ డే)
* మే 2న ఆదివారం
* మే 7న జుమత్ ఉల్ విదా
* మే 8న రెండో శనివారం
* మే 9న ఆదివారం
* మే 13న ఈదుల్ ఫితర్
* మే 14న రంజాన్
* మే 16న ఆదివారం
* మే 22న నాలుగో శనివారం
* మే 23న ఆదివారం
* మే 26న బుద్ద పౌర్ణిమ
* మే 30న ఆదివారం

మే 8, మే 22న రెండు, నాలుగో శనివారం కారణంగా బ్యాంకులు పని చేయవు. ఇక ఐదు ఆదివారాలు బ్యాంకుల ఎలాగూ క్లోజ్‌లోనే ఉంటాయి. అంటే.. మే నెలలో బ్యాంకులకు మొత్తం 12 రోజులు సెల‌వులు ఉండనున్నాయి.

ఇలా ఉండ‌గా, కరోనా వైర‌స్ వ్యాప్తి కారణంగా బ్యాంకులు 4 గంటలు మాత్రమే పని చేస్తున్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరవాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సూచించింది. అంటే, ఇప్పుడు బ్యాంకులు సాధారణ ప్రజలకు 4 గంటలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కరోనా పరిస్థితుల్లో సాధారణ స్థితి వచ్చే వరకు ఈ విధానం అమ‌ల్లో ఉంటుంది.