chennai:ఊపిరితిత్తులు పాడైనా..4నెలలకు కోలుకున్న 56 ఏళ్ల కోవిడ్ రోగి

ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయిన 56 ఏళ్ల కరోనా పేషెంట్ నాలుగు నెలల తరువాత కోలుకున్న ఘటన చెన్నైలో జరిగింది.

chennai:ఊపిరితిత్తులు పాడైనా..4నెలలకు కోలుకున్న 56 ఏళ్ల కోవిడ్ రోగి

56 Years Covid

chennai 56 years covid patient recovers after 109 days : కరోనా. ఊపిరితిత్తులపై దాడి చేసే అత్యంత ప్రమాదకరమైన వైరస్ అనే విషయం తెలిసిందే. కానీ రెండు ఊపిరితిత్తులు పాడైపోయిన 56 ఏళ్ల వ్యక్తి కరోనా సోకినా ఆ మహమ్మారిని జయించి రికార్డు క్రియేట్ చేశాడు. ఈ అద్భుతం త‌మిళ‌నాడులోని చెన్నై రెలా ఆస్పత్రిలో జరిగింది. వెంటిలేట‌ర్ పై ఏకంగా నాలుగు నెలల పాటు చికిత్స పొంది కోలుకున్నాడు. పూర్తిగా పాడైపోయిన ఊపిరితిత్తుల‌కు డాక్ట‌ర్లు ఎక్మో చికిత్స చేపట్టారు. అలా ఒక వారం రెండు వారాలు కాదు ఏకంగా 62 రోజుల పాటు ఎక్మో చికిత్స చేశారు.

ఎటువంటి ట్రాన్స్‌ప్లాంటేష‌న్ లేకుండా..అత్య‌ధిక రోజులు ఎక్మో ట్రీట్మెంట్ పొందిన 56 ఏళ్ల వ్యాపార‌వేత్త మొహ‌మ్మ‌ద్ ముదిజా కరోనాను జయించి రికార్డులకెక్కాడు. గత ఏప్రిల్ నెలాఖరిలో ముదిజాకు కరోనా సోకింది. ఈ క్రమంలో అతనికి ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. శ్వాస‌కోస వ్య‌వ‌స్థ మొత్తం దెబ్బతినటంతో ఇక అతను బతకటం కష్టమనుకున్నారు. ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోవటంతో అత‌న్ని ఎక్మో చికిత్స‌పై ఉంచారు. నిమిషానికి 10 లీట‌ర్ల ఆక్సిజ‌న్ అవ‌స‌ర‌మైన పరిస్థితుల్లో అతనికి చికిత్స కొన‌సాగించారు డాక్టర్లు.

అలా నాలుగు వారాల వ్య‌వ‌ధి త‌ర్వాత లంగ్ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ కోసం చూశాడు. కానీ సెకండ్ వేవ్ పీక్స్ లో ఉన్న తరుణంలో అత‌నికి ఆ అవ‌య‌వం లభించలేదు. కానీ డాక్ట‌ర్లు కొనసాగిస్తునే ఉన్నారు.ఎక్మో చికిత్స ఇచ్చిన అత‌నికి 9 వారాల త‌ర్వాత ఊపిరితిత్తులు కుదుట‌ప‌డ్డాయి. కాస్త శ్వాస తీసుకోవటం జరుగుతోంది. ప్ర‌స్తుతం అతను ప్రాణాలతో బయటపడి వీల్‌చైర్‌పై ఉన్నాడ‌ు.

ఈ సందర్భంగా ముదిజా మాట్లాడుతూ..నేను దాదాపు చనిపోయి బ్రతికినట్లే..ఇది నా రెండ‌వ జ‌న్మ అని అన్నాడు. చికిత్స కొనసాగుతున్న సమయంలో ముదిజా ఏం మాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా ఆత్మస్థైర్యంతో ఉన్నాడని డాక్ట‌ర్లు తెలిపారు. ఎక్మో ట్రీట్మెంట్‌కు ప్ర‌తి నెలా 40 ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతుంది. ముదిజా వ్యాపారవేత్త కాబట్టి ఆ ఖర్చు భరించాడు.ప్రస్తుతం వీల్ చైర్ పై ఉన్నాడు.