రైల్వే స్టేషన్ లో కుక్క ఉంది జాగ్రత్త : రూల్స్ బ్రేక్ చేస్తే..అంతే సంగతులు

  • Published By: veegamteam ,Published On : November 19, 2019 / 04:10 AM IST
రైల్వే స్టేషన్ లో కుక్క ఉంది జాగ్రత్త : రూల్స్ బ్రేక్ చేస్తే..అంతే సంగతులు

చెన్నై పార్క్ టౌన్ రైల్వే స్టేషన్ లో ఓ కుక్క డ్యూటీ చేస్తోంది. రైల్వే స్టేషన్ లో రూల్స్ పాటించనివారికి వాటిని గుర్తు చేస్తోంది ఓ డాగ్. రూల్స్ బ్రేక్ చేయటానికి ట్రై చేస్తే  రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) డాగ్ ఊరుకోదు..హెచ్చరిస్తుంది. ఈ కుక్కేం చేస్తుందిలే అని ముందుకెళితే..అడ్డంగా నిలబడుతుంది. ‘ఒక అడుగు ముందుకేసి చూడమంటూ’ హుంకరిస్తుంది. 

ట్రైన్ దిగాక..ప్లాట్ ఫాం మారాలన్నా..లేదా ఏముందిలే రెండు ట్రాక్ లు దాటేస్తే అవతలివైపుకు చేరుకోవచ్చు..ఇంతోటిదానికి ఫుట్ పాత్ బ్రిడ్జ్ ఎక్కటం..దికటం ఎందుకు అనుకుంటూ చాలామంది ట్రాక్ లు దాటేస్తుంటారు. అటువంటి సమయాలలో ప్రమాదాలకు గురవుతుంటారు. ప్రాణాలు కోల్పోయిన  సందర్బాలు కూడా చాలానే ఉన్నాయి. 
 
దీంతో నిబంధనలకు అతిక్రమిస్తూ రైల్వే ట్రాక్ లు దాటటం.. ప్లాట్ ఫారంపై నడుస్తున్న రైళ్లను ఎక్కటం..డీబోర్డ్ చేయటానికి యత్నిస్తే  ఈ డాగ్ ఊరుకోదు..భౌ భౌ మంటూ అరుస్తూ..వారిని హెచ్చరిస్తుంది. అప్రమత్తం చేస్తుంది. నిబంధనలు అతిక్రమించేవారిని హెచ్చరించటానికి ఆర్ పీఎఫ్ కు ఈ డాగ్ హెల్పింగ్ గా  నియమించింది రైల్వే శాఖ.  రైల్వే ట్రాక్‌లను దాటడం ప్రమాదకరమే కాదు, నేరం కూడా అని ప్రతీ ఒక్కరూ గుర్తు చేస్తుందీ డాగ్. 

చెన్నై నుంచి హైదరాబాద్ కు తరచూ ప్రయాణం చేసే ఓ ప్రయాణీకుడు మాట్లాడుతూ..తాను ఎంతో కాలం నుంచి ట్రైన్ జర్నీచేస్తున్నాను..కానీ నిబంధనలు అతిక్రమించే వారిని ఓ డాగ్ హెచ్చరించటం..చక్కగా డ్యూటీ చేయటం చాలా బాగుందంటూ ప్రశంసించారు.  ప్రయాణీకులు డీబోర్డ్ చేసినా..ట్రాకులు దాటటానికి యత్నించినా ఈ డాగ్ అరుస్తుందనీ..వారు వెనక్కి వెళ్లే వరకూ ఊరుకోదని తెలిపారు. 

నవంబర్ 6న పశ్చిమ రైల్వే శాఖ కొన్ని స్టేషన్లలో నిబంధనలకు వ్యతిరేకంగా రైల్వే ట్రాకులు దాటేవారిని యమధర్మ రాజు గెటప్ లో ఉన్న వ్యక్తి భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లిపోతున్నట్లు..ఇప్పుడు తాజాగా రైల్వే స్టేషన్లలోను..ట్రాక్ ల దగ్గర నిబంధనలు విరుద్ధంగా ప్రవర్తించేవారి కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ఈ డాగ్ ను నియమించటం వంటి వినూత్న యత్నాలతో రైల్వే శాఖ ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది. ఇటువంటి యత్నాలన్నీ ప్రజల ప్రాణాల్ని కాపాడటానికేననే విషయం ప్రతీ ఒక్కరూ గుర్తించుకోవాలి. నిబంధనలు పాటించండీ..ప్రాణాలను కాపాడుకోండి. మనం చేసే చిన్న పాటి పొరపాటు కుటుంబాలలో విషాదాలకు కారణం కాకూడదు.