Ideas2IT : 100 మంది ఉద్యోగులకు కార్లు గిఫ్ట్

సిలికాన్ వ్యాలీకి చెందిన ఐటీ కంపెనీ 'Ideas2IT' వంద మంది ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చింది...కార్లను బహుకరించడం ఆనందంగా ఉందని, సంస్థ అభివృద్ధికి కీలకంగా సేవలందించారని తెలిపారు...

Ideas2IT : 100 మంది ఉద్యోగులకు కార్లు గిఫ్ట్

Cars

Chennai-Based IT Company : పండుగలు వచ్చాయంటే.. పలు కంపెనీలు భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయనే సంగతి తెలిసిందే. అంతేగాకుండా.. కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు బహుమతులను అందిస్తాయి. సూరత్ వజ్రాల వ్యాపారి కంపనీలోని ఉద్యోగులకు ఖరీదైన బహుమతులను ఇస్తూ.. ఆశ్చర్యానికి గురి చేస్తుంటారనే సంగతి తెలిసిందే. కొన్ని కంపెనీల యాజమాన్యాలు కళ్లు చెదిరే గిఫ్ట్ లను ఇస్తూ.. వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా.. చెన్నై ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ‘Ideas2IT’ ఇంజినీరింగ్ సంస్థ ఉద్యోగులకు మారుతీ సుజుకీ కార్లను బహుమతినిచ్చింది. ఇటీవలే ఐదుగురు టాప్ మేనేజ్ మెంట్ సిబ్బందికి సరికొత్త BMW కార్లను బహుమతిగా ఇచ్చింది.

Read More : Weekly 4 days: వారానికి 4 రోజులే పని.. కొత్త లేబర్ కోడ్

సిలికాన్ వ్యాలీకి చెందిన ఐటీ కంపెనీ ‘Ideas2IT’ వంద మంది ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చింది. సంస్థ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ మురళీ వివేకానందన్, సీఈవో గాయత్రి వివేకానందన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్లను బహుకరించడం ఆనందంగా ఉందని, సంస్థ అభివృద్ధికి కీలకంగా సేవలందించారని తెలిపారు. వీరందరినీ అభినందించారు. కంపెనీ అభివృద్ధికి ఉద్యోగులు ఎన్నో ప్రయత్నాలు చేశారని, కంపెనీ వారికి కార్ల ఇవ్వడం లేదని..వారి కష్టార్జితంతో సంపాదించుకున్నారని సీఈవో గాయత్రి వివేకానందన్ తెలిపారు. ఈ కార్లను బహుమతిగా ఇవ్వడం మొదటి అడుగు మాత్రమేనని భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని తాము ప్రణాళిక రచిస్తున్నామన్నారు.

Read More : Naga Chaitanya : నాగచైతన్య కార్ ఆపి ఫైన్ వేసిన పోలీసులు..

ఇక కంపెనీ విషయానికి వస్తే… 2009లో సిలికాన్ వ్యాలీలో’Ideas2IT’ సంస్థను ప్రారంభించారు. కేవలం అప్పుడు ఆరుగురు ఇంజినీర్లతో ప్రయాణం ప్రారంభించింది. ప్రస్తుతం 500 మందికి పైగా నిపుణులు పని చేస్తున్నారని కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. వీరందరూ యూఎస్, భారత్, మెక్సీకోలలో పని చేయడం జరుగుతోందని, ఫేస్ బుక్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ పలు దిగ్గజ సంస్థలకు సాఫ్ట్ వేర్ ప్రాజెక్టులను అందిస్తామని పేర్కొంది. ప్రతి సందర్భంలో కంపెనీ యాజమాన్యం బంగారు నాణేలు, ఐఫోన్ లు ఇతర బహుమతులు ఇస్తోందని కానీ కారు ఇవ్వడం పెద్ద గొప్ప విషయమని ఉద్యోగి ప్రశాంత్ తెలిపారు.