Tamil Nadu : ఉద్యోగులకు దీపావళి కానుకగా కార్లు, బైకులు గిఫ్టులుగా ఇచ్చిన వ్యాపారి

ఉద్యోగులకు దీపావళి కానుకగా కార్లు, బైకులు గిఫ్టులుగా ఇచ్చాడు ఓ వ్యాపారి.

Tamil Nadu : ఉద్యోగులకు దీపావళి కానుకగా కార్లు, బైకులు గిఫ్టులుగా ఇచ్చిన వ్యాపారి

jewellery shop owner gifted cars and bikes to his staff as diwali gifts

Tamil Nadu : చెన్నైలో ఓ బంగారం వ్యాపారి తన వద్ద పనిచేసే ఉద్యోగులకు దీపావళి కానుకలు ఇచ్చాడు. దీపావళి కానుక అంటే ఏదో ఓ స్వీటు బాక్సో..లేదా ఓ నెల బోనస్సో కాదు ఏకంగా బైకులు..కార్లు దీపావళి కానుకగా ఇచ్చి పెద్ద మనస్సు చాటుకున్నాడు. తన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న ఉద్యోగాలకు దీపావళి పండుగకు మంచి బహుమతులు ఇవ్వాలనుకున్నాడు. అలా కార్లు, బైకులు గిఫ్టులుగా ఇచ్చి తన ఉద్యోగులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు.

తమిళనాడుకు చెందిన జయంతి లాల్‌కు చెన్నైలో చలని జ్యువెల్లరీ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. తన వద్ద పనిచేస్తున్న వారికి రూ.1.2 కోట్లు విలువచేసే 10 కార్లు, 20 బైకులను దీపావళి కానుకగా అందించాడు. ఎనిమిదిమందికి కార్లు..18మందికి బైకులు కొనిచ్చాడు. వీరంతా నా ఉద్యోగులు మాత్రమే కాదు నా సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని..అందుకే వారికి దీపావళి కానుకగా కార్లు, బైకులు కొని ఇచ్చానని దీంతో నా స్టాఫ్ అంతా సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు జయంతి లాల్.

నా స్టాఫ్ నా కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటున్నారని పండుగకు తమ కుటుంబం ఎంత సంతోషంగా వేడుకను జరుపుకుంటుందో అలాగే వారి కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని భావించానని అందుకే ఈ దీపావళికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇవ్వాలనుకున్నానని అలా కార్లు, బైకులు కొన్నానని తెలిపారు. ను. ఇది వారి పనికి ప్రోత్సాహకంగా ఉంటుందని భావించి జయంతి లాల్ ప్రతి యజమాని తన ఉద్యోగులను గౌరవించాలి అని సూచించారు. యజమాని సిబ్బంది మనస్ఫూర్తిగా గౌరవిస్తే ఆ సంస్థ లాభాల సాధిస్తుందని అన్నారు జయంతి లాల్.