Love Marriage : ప్రేమపెళ్లి యువకుడి ప్రాణం తీసింది

బంధువు చనిపోయాడని సొంతూరికి వెళ్లి కానరాని లోకానికి వెళ్ళాడు. భార్య కుటుంబ సభ్యులకు గ్రామంలోని గోడలపై శ్రద్ధాంజలి ఫోటోలు చూసి కుప్పకూలిపోయారు.

Love Marriage : ప్రేమపెళ్లి యువకుడి ప్రాణం తీసింది

Love Marriage

Love Marriage : రైల్లో పరిచయం ప్రేమగా మారింది. వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా సాగుతున్న ఆ జంటను విడగొట్టాలని పధకం పన్నారు అబ్బాయి కుటుంబ సభ్యులు.. బాగా కావలసిన వారు చనిపోయారని చివరి చూపు చూడటానికి ఊరు రావాలని పిలిచారు. పధకం ప్రకారం అత్యచేసి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. యువతి కుటుంబ సభ్యులు గ్రామానికి వెళ్లి చూడటంతో.. అతడి శ్రద్ధాంజలి ఫోటోలు ఊర్లో గోడలపై కనిపించాయి..

Read More : B S Yediyurappa : “బెస్ట్ ఎమ్మెల్యే” అవార్డు అందుకున్న యడియూరప్ప

ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా అరియనెల్లూరు గ్రామానికి చెందిన అమూల్య అనే యువతి నర్సుగా ఉద్యోగం చేస్తుండేది. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న ఆ యువతి రోజూ ట్రైన్‌లో వెళ్లి వస్తుండేది. అదే ట్రైన్‌లో రోజూ చెన్నైకు వెళ్లి పని చేసుకుని తిరిగి వస్తుండే కరణి గ్రామానికి చెందిన గౌతమ్ అనే యువకుడు పరిచయమయ్యాడు. వారి పరిచయం ప్రేమగా మారింది. ఇంట్లో పెద్దలకు చెప్పారు. ఇరువురి కులాలు వేరుకావడంతో యువకుడి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. కుటుంబ సభ్యులను ఎదిరించి 2019లో పెళ్లి చేసుకున్నారు.

Read More : part time jobs : అమెజాన్ లో 1,10,000 ఉద్యోగాలు

పెళ్లి అయిన తర్వాత గౌతమ్ తన సొంత ఊరు వెళ్ళలేదు. సెప్టెంబర్ 17న గౌతమ్‌కు బంధువుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. బాగా దగ్గర బంధువుల్లో ఒకరు చనిపోయారని, చివరి చూపుకు రావాలని గౌతమ్‌కు చెప్పడంతో హుటాహుటిన అక్కడకు వెళ్లాడు. అలా వెళ్లిన గౌతమ్ ఇంక తిరిగి రాలేదు. భర్త రోజులు గడుస్తున్నా తిరిగి రాకపోవడం, ఎన్నిసార్లు కాల్ చేసినా స్పందన లేకపోవడంతో అమూల్యలో కంగారు మొదలైంది. తన భర్త సొంత ఊరు వెళ్లి తిరిగి రాలేదని అమూల్య తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు గౌతమ్ సొంతూరికి వెళ్లారు. ఆ ఊర్లో గోడలపై గౌతమ్ శ్రద్ధాంజలి పోస్టర్లు చూసి అమూల్య తల్లిదండ్రులు షాకయ్యారు.

అప్పటికే గౌతమ్ అంత్యక్రియలు కూడా పూర్తయినట్లు తెలిసి కూతురికి జరిగిన విషయం చెప్పారు. అమూల్య ఈ ఘటన గురించి తెలిసి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే గత నెలలోనే వీరికి ఒక పాప పుట్టింది. తన భర్తను పొట్టన పెట్టుకున్నారని అరణి పోలీస్ స్టేషన్ లో గౌతమ్ తల్లిదండ్రులపై అమూల్య ఫిర్యాదు చేసింది. ఇది కచ్చితంగా పరువు హత్యేనని, ఈ పెళ్లి గౌతమ్ తల్లిదండ్రులకు ఇష్టం లేదని.. తన భర్తను నమ్మించి సొంతూరు తీసుకెళ్లి చంపేశారని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అమూల్య కు జరిగిన అన్యాయం స్థానికులను కలచివేస్తోంది.