Chennai Rain : చెన్నై నగరంలో కుంభవృష్టి…లోకల్ ట్రైన్స్ రద్దు

చెన్నై నగరాన్ని వరుణుడు వీడడం లేదు. కుంభవృష్టి కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా వరద ముప్పు ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Chennai Rain : చెన్నై నగరంలో కుంభవృష్టి…లోకల్ ట్రైన్స్ రద్దు

Rains

Chennai Rain : చెన్నై నగరాన్ని వరుణుడు వీడడం లేదు. కుంభవృష్టి కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా వరద ముప్పు ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 2015 సంవత్సరంలో నమోదైన వర్షపాతాన్ని మించుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే 20 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. 2021, అక్టోబర్ 06వ తేదీ శనివారం రాత్రి నుండి 200 మిమి వర్షపాతం చెన్నై లో నమోదైంది. లోకల్ ట్రైన్స్ రద్దు చేశారు. తమిళనాడులోని చెన్నై, కన్యాకుమారి, కాంచీపురం, తిరువళ్ళూరు, మధురై, తిరుచ్చి, కోయంబత్తూరుతో సహా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Read More : Mahabubabad : ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసిన పాము

దీంతో పుయల్, చంబారపాకం డ్యాంలు నిండుకున్నాయి. డ్యాం నుండి నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. టి నగర్, వెలచ్చేరి, గిండిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ముందస్తు జాగ్రత్తలో భాగంగా..పలు ప్రాంతాలలో విద్యుత్ ను నిలిపివేశారు. చెన్నై కార్పొరేషన్ పరిధిలో కాల్ సెంటర్ ఎర్పాటు చేశారు అధికారులు. వర్ష బీభత్సంపై సీఎ స్టాలిన్ ఆరా తీస్తున్నారు. సహాయక చర్యలు ఎప్పటికప్పుడు జరగాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు అందరూ వారి వారి నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయకచర్యలు చేపట్టాలని సూచించారు.

Read More : Gold Price Today : భారీగా పెరిగిన బంగారం ధరలు.. మూడు నెలల గరిష్ఠానికి జంప్

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పర్యటించే అవకాశం ఉంది. తిరువళ్ళూరు, చెంగల్ పట్టు, చెన్నైలకు NDRF బృందాలు చేరుకున్నాయి. బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన అల్పపీడనం వచ్చే 48 గంటల్లోగా మహా వాయుగుండంగా తీవ్ర రూపం దాలుస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రుతుపవనాల రాకతో గత నెల 28వ తేదీ నుంచి ఈనెల 3వ తేదీ వరకు డెల్టా, కోస్తా జిల్లాలను వర్షం ముంచెత్తింది. ఆదివారం నుంచి మరో ఐదు రోజుల పాటు తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.