కత్తులతో దాడి చేసుకున్న చెన్నై LAW విద్యార్థులు

కత్తులతో దాడి చేసుకున్న చెన్నై LAW విద్యార్థులు

చెన్నై లా కాలేజీ విద్యార్థులు నడిరోడ్డుపై రౌడీల్లా చెలరేగిపోయారు. సీనియర్ విద్యార్థి ఒకరు కత్తి తీసుకుని జూనియర్‌పై దాడి చేశాడు. ఈ క్రమంలో అశ్విన్ అనే విద్యార్థికి గాయాలయ్యాయి. కొద్ది రోజులుగా సీనియర్-జూనియర్ల మధ్య విభేదాలు జరుగుతున్నాయి. 

సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వాలని, జూనియర్లు.. సీనియర్లు కనపడినప్పుడు భయంతో ఉండాలనే అంశాలపై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వాదనలు పెరగడంతో గురువారం సీనియర్లకు జూనియర్లకు కౌంటర్ ఇచ్చారు. దాంతో వెనక్కు తగ్గిన సీనియర్లు సమయం కోసం ఎదురుచూశారు. 

శుక్రవారం జూనియర్ విద్యార్థుల బ్యాచ్ లీడర్ అశ్విన్ ఒంటరిగా కనపడటంతో సీనియర్ బ్యాచ్ లీడర్ సెల్వరాజన్ కత్తితో దాడికి దిగాడు. విచక్షణ రహితంగా కత్తితో గాయాలు చేశాడు. రోడ్లపై ఉన్నపై వారు ప్రమాదాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో వారికి సైతం గాయాలయ్యాయి. దాడికి దిగిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.