Elephants Attack : ఊరిపై ఏనుగుల గుంపు బీభత్సం..జైలులో తలదాచుకుంటున్న గ్రామస్తులు

ఏనుగుల దాడికి భయపడిపోయిన ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని కాంక‌ర్‌ జిల్లాలోని పిచ్చెట్టా గ్రామస్తులు ఊరు వదిలిపెట్టి జైలులో తలదాచుకుంటున్నారు. ఏనుగుల నుంచి తమను తాము రక్షించుకోవటానికి కాంకర్ లోని పిచ్చెట్టా గ్రామస్తులు ప్రతీరోజు జైలుశిక్ష అనుభవిస్తున్నారు. రాత్రి సమయంలో జైలులో గడుపుతూ ప్రాణాలు కాపాడుకుంటున్నారు.

Elephants Attack : ఊరిపై ఏనుగుల గుంపు బీభత్సం..జైలులో తలదాచుకుంటున్న గ్రామస్తులు

Elephants Attack

Elephants Attack : ఏనుగులు అడవులు దాటి గ్రామాలపై దాడి చేస్తే..ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది? ఊహించటానికే భయపడేలా ఉంటుంది. ఏనుగులు అడవుల్లోంచి వచ్చి పంటల్ని నాశనం చేస్తే వాటిని తరిమేందుకు గ్రామస్తులంతా ఒక్కటవుతారు. కానీ ఏకంగా మనుషులమీదే దాడిచేస్తే పరిస్థితి ఏంటీ? భయంతో పరుగులే పరుగులు పెడతారు. కానీ రాత్రి సమయంలో దాడి చేస్తే ఇక ప్రాణాలమీద ఆశ వదిలేసుకోవాల్సిందే. అలా ఏనుగుల దాడికి భయపడిపోయిన ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని కాంక‌ర్‌ జిల్లాలోని పిచ్చెట్టా గ్రామస్తులు ఊరు వదిలిపెట్టి జైలులో తలదాచుకుంటున్నారు. ఏనుగుల నుంచి తమను తాము రక్షించుకోవటానికి కాంకర్ గ్రామస్తులు ప్రతీరోజు జైలుశిక్ష అనుభవిస్తున్నారు. అదేనండీ రాత్రి సమయంలో జైలులో దాక్కుంటున్నారు.

కాంకర్‌లోని పిచ్చెట్టా గ్రామంలో ఏనుగులు జనాలను హడలెత్తిస్తున్నాయి. జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆహారం కోసం దండ‌కార‌ణ్యం నుంచి స‌మీపంలోని పిచ్చెట్టా గ్రామంపై వచ్చేస్తున్నాయి. జనాలపై దాడి చేస్తున్నాయి. ఏనుగుల బారి నుంచి తమను తాము కాపాడుకోవటానికి ప్రజలు ఎన్నో సార్లు అధికారులకు తమ గోడు విన్నవించుకున్నారు. కానీ ఫలితం లేదు. దీంతో భయపడిపోయిన జనాలు పిల్లలతో కలిసి పిచ్చెట్టా గ్రామం సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న జైలులో పడుకుంటున్నారు. రాత్రి అంతా అక్కడే నిద్రపోయి పగటిపూట గ్రామంలోకి వచ్చి ఎవరి పనులు వారు చూసుకుంటున్నారు. ఓ పక్క ఎక్కడ ఏనుగుల మంద వచ్చి దాడిచేస్తుందోననే భయంతోనే పగలంతా ఉంటున్నారు.అలా రాత్రిళ్లు మాత్రం జైలు నిర్మాణంలో తలదాచుకుంటున్నారు 300లమంది గ్రామస్తులు.

ఏనుగుల గుంపు గ్రామంపైకి వచ్చి ఇళ్లను నాశం చేస్తుండటంతో గ్రామ‌స్థులు ఎంతో నష్టపోయారు.ఇళ్లలను సామాన్లు..మంచాలు ఇలా ఏదికనిపిస్తే వాటిని ధ్వంసం చేసి పారేస్తున్నాయి. ఇళ్ల‌ల్లో ఆహారం కోసం ఇలా దాడిచేస్తున్నాయని అంటున్నారు గ్రామస్థులు. దాచిపెట్టుకున్న ఆహారప‌దార్థాల‌ను అందిన కాడికి తినేస్తూ..చెల్లాచెదురు చేసేస్తున్నాయని వాపోతున్నారు. దీంతో ఓ పక్క కరోనా కష్టాలు మరోపక్క ఏనుగులు చేసే బీభత్సంతో నానా కష్టాలు పడుతున్నామని తమ గోడు అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదని వాపోతున్నారు.

12 నుంచి 14 వ‌ర‌కు ఉన్న ఏనుగుల గుంపు ప్ర‌తిరోజు ఏనుగులు తప్పకుండా గ్రామంమీద దాడి చేస్తున్నాయని..దీంతో తిండీ సంగతి ఎలా ఉన్నా ప్రాణాలు కాపాడుకోవటమే మాకు పనిగా మారిపోయిందంటున్నారు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నామని వాపోతున్నారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం త‌మ గోడును ప‌ట్టించుకొని ర‌న్వాహి కొండ ప్రాంతంలో ఉండి దాడులు చేస్తున్న ఏనుగుల గుంపు బారి నుంచి త‌మ‌ను కాపాడాల‌ని పిచ్చెట్టా గ్రామ‌స్థులు కోరుతున్నారు.