Reservations: 76 శాతానికి రిజర్వేషన్లను పెంచిన ఛత్తీస్‭గఢ్.. ఏయే వర్గానికి ఎంత కేటాయింపంటే?

రాష్ట్రంలోని ఓబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారి సంఖ్యను నిర్దిష్టంగా తెలుసుకునేందుకు క్వాంటిఫయబుల్ డేటా కమిషన్‌ను గత ప్రభుత్వాలు (బీజేపీని ఉద్దేశించి) ఏర్పాటు చేయలేకపోయాయని విమర్శిస్తూనే తమ ప్రభుత్వం 2019లో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని అన్నారు. అయతే కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ కమిషన్ కార్యకలాపాలకు అంతరాయం కలిగిందని, అందుకే కాస్త ఆలస్యమైందని అన్నారు

Reservations: 76 శాతానికి రిజర్వేషన్లను పెంచిన ఛత్తీస్‭గఢ్.. ఏయే వర్గానికి ఎంత కేటాయింపంటే?

Reservations: తమిళనాడు, జార్ఖండ్ ప్రభుత్వ బాటలో ఛత్తీస్‭గఢ్ ప్రభుత్వం సైతం పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా రాష్ట్రంలో రిజర్వేషన్లను 76 శాతానికి పెంచారు. రాష్ట్రంలోని జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యారంగంలో ప్రవేశాలు, పదోన్నతుల్లో అవకాశం కల్పించేందుకు ఉద్దేశించి రెండు బిల్లుల్ని శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న 69 శాతం రిజర్వేషన్లు 76 శాతానికి చేరాయి.

ఈ పెంపుతో ఆయా వర్గాలకు రిజర్వేషన్ లబ్ది మారిపోయింది. తాజా పెంపుతో ఓబీసీ రిజర్వేషన్ ఎక్కువగా పెరిగినట్టైంది. ఇంతకు ముందు ఓబీసీలకు 14 శాతం మాత్రమే రిజర్వేషన్ లభించేంది. అయితే తాజా మార్పుతో 27 శాతానికి వారి రిజర్వేషన్ పెరిగింది. ఇక ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలు) రిజన్వేషన్‭ను తగ్గించారు. వాస్తవానికి వారికి 10 శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. దాదాపుగా మెజారిటీ రాష్ట్రాల్లో ఇదే అమలు అవుతోంది. అయితే రాష్ట్రంలో వారి సంఖ్య కేవలం 3.48 శాతం మాత్రమే ఉండడంతో, వారి రిజర్వేషన్‭ను 4 శాతానికి తగ్గించారు. ఇక ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు రాలేదు. గతంలో లాగే ఎస్టీలకు 32 శాతం, ఎస్సీలకు 13 శాతం రిజర్వేషన్ ఉంది.

Bomb Blast West Bengal: టీఎంసీ నేత ఇంట్లో పేలిన బాంబు.. ముగ్గురు మృతి.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీస్ (షెడ్యూల్డ్ కేస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్) అమెండ్‌మెంట్ బిల్లు, ఛత్తీస్‌గఢ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (రిజర్వేషన్ ఇన్ అడ్మిషన్) అమెండ్‌మెంట్ బిల్లులను ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సుమారు 5 గంటల చర్చ అనంతరం ఈ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం లభించింది. ఈ బిల్లులపై చర్చలో భాగంగా బాఘెల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఓబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారి సంఖ్యను నిర్దిష్టంగా తెలుసుకునేందుకు క్వాంటిఫయబుల్ డేటా కమిషన్‌ను గత ప్రభుత్వాలు (బీజేపీని ఉద్దేశించి) ఏర్పాటు చేయలేకపోయాయని విమర్శిస్తూనే తమ ప్రభుత్వం 2019లో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని అన్నారు. అయతే కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ కమిషన్ కార్యకలాపాలకు అంతరాయం కలిగిందని, అందుకే కాస్త ఆలస్యమైందని అన్నారు. ఇక తాజాగా చేసిన సవరణలను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూలులో చేర్చాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరాలని అన్ని పార్టీల ఎమ్మెల్యేలను కోరారు.

OYO Layoff Employees: ఒయోలో భారీ మార్పులకు శ్రీకారం.. ఇంటిబాట పట్టనున్న 10శాతం మంది ఉద్యోగులు