BJP MLA Wore Helmet To meeting : ఇదేందయ్యో..! హెల్మెట్ పెట్టుకుని మీటింగ్‌లో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే..
సాధారణంగా బైక్ పై వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటారు. సేఫ్టీ కోసం. కానీ ఛత్తీస్‌ఘడ్ బీజేపీ ఎమ్మెల్యే అజయ్ చంద్రకార్ మాత్రం హెల్మెట్ ధరించి మీటింగ్ లో పాల్గొన్నారు. హెల్మెట్ పెట్టుకుని మీటింగ్ లో కూర్చున్న సదరు ఎమ్మెల్యేని చూసి జనాలు షాక్ అయ్యారు. నవ్వుకున్నారు. కానీ అవేమీ పట్టని సదరు ఎమ్మెల్యే మీటింగ్ లో కూల్ గా కూర్చున్నారు.

BJP MLA Wore Cricket Helmet To Public meeting : సాధారణంగా బైక్ పై వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటారు. సేఫ్టీ కోసం. కానీ ఛత్తీస్‌ఘడ్ బీజేపీ ఎమ్మెల్యే అజయ్ చంద్రకార్ మాత్రం హెల్మెట్ ధరించి మీటింగ్ లో పాల్గొన్నారు. హెల్మెట్ పెట్టుకుని మీటింగ్ లో కూర్చున్న సదరు ఎమ్మెల్యేని చూసి జనాలు షాక్ అయ్యారు. నవ్వుకున్నారు. కానీ అవేమీ పట్టని సదరు ఎమ్మెల్యే మీటింగ్ లో కూల్ గా కూర్చున్నారు.
ముందు జాగ్రత్తగానే ఎమ్మెల్యే ఇలా హెల్మెట్ ధరించారా? అని గుసగుసలాడుకున్నారు సమావేశానికి వచ్చిన జనాలు. బహుశా ఆ మీటింగ్ లో పాల్గొన్న నేతలు కూడా అనుకునే ఉంటారు. ఇంతకీ ఎమ్మెల్యే అజయ్ హెల్మెట్ ధరించి మీటింగ్ లో పాల్గొనటానికి వెనుక ఓ కారణం ఉంది. ఇటీవల సుపేలాలో జరిగిన మీటింగ్‌లో పాల్గొన్న ఆయనపై కొంతమంది రాళ్లు రువ్వారు. ఆ ఘటనకు నిరసనగా మరో మీటింగ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే అజయ్ తన తలకు హెల్మెట్ ధరించారన్నమాట.
ఈ సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో కూడా ఎమ్మెల్యే అజయ్ హెల్మెట్ పెట్టుకునే ప్రసంగించారు.ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సుపేలా మీటింగ్‌లో తనపై రాళ్లు రువ్వారని, కానీ రాళ్లు రువ్వేవాళ్లు ఛత్తీస్‌ఘడ్ ప్రజలపై కాకుండా నాపై రాళ్లు రువ్వారు అంటూ సెటైర్ వేశారు. కాగా ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఎమ్మెల్యే అజయ్ కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలపై రాళ్లు రువ్వకుండా తనపై విసిరారు అంటూ సెటైర్ వేశారు.
ఈ సందర్భంగా సమావేశంలో ప్రసంగించిన ఎమ్మెల్యే అజయ్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలపై కూడా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు దేశం కోసం ప్రాణాలు అర్పించారని బీజేపీ నుంచి ఒక్క కుక్క అయినా ఈ త్యాగం చేసిందా? అంటూ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై అజయ్ చంద్రాకర్ మాట్లాడుతూ..”స్వాతంత్య్ర పోరాటంలో బలిదానం పొందిన కాంగ్రెస్ నాయకుడు ఎవరు? ఆ పోరాటానికి ప్రాణాలర్పించిన వారిలో కాంగ్రెస్ వాది ఎవరూ లేరు. దేశం కోసం మరణించిన లాల్ లజపతిరాయ్‌ను కాకుండా మరొకరిని (కాంగ్రెస్‌కు చెందినవారు) ఖర్గేజీ చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. కాగా ఖర్గే చేసిన కుక్క వ్యాఖ్యలపై పార్లమెంట్ దద్దరిల్లిపోయింది.