50 ఏళ్ల సహజీవనం..పిల్లలు,మనమళ్లు చేసిన విచిత్ర వివాహం

  • Published By: veegamteam ,Published On : February 17, 2020 / 10:29 AM IST
50 ఏళ్ల సహజీవనం..పిల్లలు,మనమళ్లు చేసిన విచిత్ర వివాహం

స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచారు ఛత్తీస్ ఘడ్ లోని శుకల్ నిషాద్(73), గౌతర్‌హిన్ బాయిలు. ప్రేమలో స్వచ్ఛత..నిజాయితీ ఉంటే పెళ్లే చేసుకోవాల్సిన పనిలేదని ఒకరిపై మరొకరికి నమ్మకం ఉంటే చాలనుకున్నవారిద్దరూ 50 సంవత్సరాల పాటు  సహజీవనం చేశారు. వారి ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన  పిల్లలు..వారికి పుట్టిన పిల్లలు కలిసి ఇన్ని సంవత్సరాలకు శుకల్ నిషాద్ కు గైతర్ హిన్ లకు పెళ్లి చేశారు.ఈ వింత విచిత్ర వివాహం గురించి స్థానికంగానే కాదు తెలిసినవారంతా ఆహా..ఎంత స్వచ్ఛమైన ప్రేమ అనుకుంటున్నారు. 

ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌థామ్ జిల్లాలోని ఖైర్జిటీ కాలా గ్రామంలో జరిగిన ఈ పెళ్లికి స్థానికులంతా హాజరయ్యారు. ఈ విచిత్ర వివాహం వెనుక ఓ ఆసక్తికర కధనం కూడా ఉంది. అదేంటో తెలుసుకుందాం.. 

ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం శుకల్ నిషాద్ పెళ్లి చూపుల కోసం అమ్మాయిని చూసుకోవటానికి బెమెత్రా జిల్లాలోని బిర్శింగ్ గ్రామానికి వచ్చాడు. అక్కడ పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయిని కాకుండా ఆమె చెల్లెలు గౌతర్ హిన్ బాయిని చూసి మనస్సుపడ్డాడు. తరువాత వారిద్దరి మధ్యా పరిచయం పెరిగింది. అదికాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసే ఉంటున్నారు. దానికి గ్రామస్తులెవ్వరూ అభ్యంత చెప్పకపోవటం విశేషం. ఒకరిపై మరొకరికి ఉన్న  ప్రేమతోను..అంతకు మించిన నమ్మకంతోను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వారికి రాలేదు. అలా వారి ప్రేమకు ప్రతిరూపంగా ఇద్దరు కొడుకులు ..ఒక కూతురు పుట్టారు. వాళ్లు పెద్దవారయ్యారు. పెళ్లిళ్లు చేశారు. వారికి మొత్తం ఎనిమిదిమంది పిల్లలు పుట్టారు.ఆ ప్రేమికులు మాత్రం అదే నమ్మకంతో..ప్రేమతో కలిసే ఉన్నారు.  మ

అలా 50 ఏళ్లుగా పెళ్లి చేసుకోకుండానే కలసి జీవిస్తున్నవీరు ఎట్టకేలకు పెళ్లి చేసుకోవాలని ముచ్చటపడ్డారు. ఆ విషయాన్ని పిల్లలకు చెప్పారు. వాళ్లు కూడా ఆనందంగా అంగీకరించారు. పిల్లలు తల్లీదండ్రులకు..మనుమలు వాళ్ల తాతా బామ్మలకు పెళ్లి పనులు చేశారు. గ్రామస్తుల సమయంలో అంగరంగ వైభోగంగా శుకల్ నిషాద్ (73), గౌతర్‌హిన్ బాయి(67)ల పెళ్లి జరిగింది.పెళ్లి చేసుకుని చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి విడిపోయేవారికి..సహజీవనం పేరుతో కొంతకాలం కలిసి ఉండి బ్రేకప్ అంటూ మూడు అక్షరాలు చెప్పేసుకుని విడిపోతున్న జంటలకు శుకల్ నిషాద్,గౌతర్‌హిన్ బాయిలను చూసి స్ఫూర్తి పొందాలని  అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 

కాగా..ఉత్తర ప్రదేశ్ లోని బారాంబరికి చెందిన ఒక వృద్ధులు సుకుమార్ (80) రాజ్ పాతాదేవి (70) 50 సంవత్సరాల నుండి కలిసి నివసిస్తున్నారు. చిన్నానాటి నుంచే వారు ప్రేమించుకున్నారు. ఇప్పటికీ కలిసే జీవిస్తున్నారు.