Chhattisgarh HC : భూకబ్జా కేసులో నోటీసులు..కోర్టు విచారణకు హాజరైన ‘పరమశివుడు’..!

మనిషి చేసిన తప్పులకు సాక్షాత్తు పరమశివుడే కోర్టుకు హాజరయ్యాడు...! మనిషి దురాశకు మనిషులు రూపొందించి న్యాయస్థానానికి గుడి నుంచి కదలి వచ్చి విచారణ హాజరయ్యాడు పరమశివుడు.

Chhattisgarh HC : భూకబ్జా కేసులో నోటీసులు..కోర్టు విచారణకు హాజరైన ‘పరమశివుడు’..!

Chhattisgarh Govt Land Occupation Case Shivling  attend Court

Chhattisgarh Govt Land occupation Case Shivling  Attend court : మనిషి చేసిన తప్పులకు ప్రాయశ్చితంగా భగవంతుడికి ప్రార్థిస్తాం. అటువంటిది భగవంతుడికి కష్టమొస్తే..మనుషులు చేసిన తప్పులకు దేవుడు బాధ్యత వహిస్తాడా? మనిషి చేసిన తప్పులకు భగవంతుడు మనుషుల తీర్పుకు హాజరు అవుతాడా? ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి దుర్మార్గం? అనే ఘటన ఛత్తీస్ గఢ్ లో చోటుచేసుకుంది. మనుషులు చేసిన తప్పుకు సాక్షాత్తు ఆ పరమశివుడే కోర్టు విచారణకు హాజరైన ఘటన ముక్కున వేలు వేసుకునేలా చేసింది…!! ప్రభుత్వ భూమిని కబ్జాచేశారంటూ సాక్షాత్తు పరమశివుడికే హైకోర్టు సమన్లు జారీ చేసిన ఘటన ఛత్తీస్‌గఢ్లోని రాయ్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. మార్చి 25న జరిగే విచారణకు హాజరు కావాలంటూ కోర్టు శివుడినే ఆదేశించింది కోర్టు. దీంతో సాక్షాతు ఆ పరమశివుడే కోర్టు విచారణకు హాజరు అయ్యాడు..!! వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం.. ప్రభుత్వ భూమి కబ్జా కేసులో సాక్షాత్తు ఆ పరమశివుడు ఒక్కడే కాదు ఆయనతోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 9 మంది కూడా విచారణకు హాజరయ్యారు.

Also read : Lord Shiva: ప్రభుత్వభూమిని ఆక్రమించారంటూ “పరమశివుడికే” కోర్టు నోటీసు

ఈ వింత కేసు వివరాల్లోకి వెళ్తే.. చత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లో 25వ వార్డుకు చెందిన సుధా రజ్వాడే బిలాస్‌పూర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ..ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని..ఆ భూమిలో ఉన్న శివాలయం సహా 16 మందిని నిందితులుగా పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారించిన హైకోర్టు ఈ కేసును దర్యాప్తు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన తహసీల్దార్ కార్యాలయం ప్రాథమిక విచారణ ప్రారంభించి 10 మందికి నోటీసులు జారీ చేసింది. మార్చి 25న జరగనున్న విచారణకు హాజరై భూకబ్జా ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నోటీసులు అందుకున్న పది మందిలో పరమశివుడు ఆరో వ్యక్తి కావడం స్థానికంగా చర్చనీయాంశం అయింది.

Also read : Banks Closed : నేటి నుంచి వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్

విచారణకు హాజరుకాకుంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది. చర్యల్లో భాగంగా భూమిని ఖాళీ చేయించి రూ. 10 వేల జరిమానా విధించాల్సి వస్తుందని అందులో పేర్కొంది. దీంతో నోటీసులు అందుకున్న శివుడితోపాటు 9 మంది కోర్టు విచారణకు హాజరయ్యారు. గుడిలోని శివలింగాన్ని రిక్షాలో కోర్టుకు తీసుకొచ్చి హాజరు పరిచారు. ఇది నేటి కబ్జాదారుల దురాశకు గుడిలో పూజలు అందుకోవాల్సిన పరమశివుడు కోర్టుకు హాజరుకావాల్సి వచ్చింది. ఇటువంటివారిని చూసే మన పెద్దలు ‘కొంతమంది గుడిని మింగితే మరికొందరు గుడిలో లింగాన్నే మిగుతారు’అని అంటారు…