Dongaa Police: చెట్టెక్కి కూర్చున్న దొంగ.. పోలీసులు ఏం చేశారంటే?

Dongaa Police: చెట్టెక్కి కూర్చున్న దొంగ.. పోలీసులు ఏం చేశారంటే?

Dongaa Police

Dongaa Police: దొంగలు వేసే ఎత్తులు ఒక్కోసారి పోలీసులకు కూడా అర్ధం కావు. పోలీసుల కళ్లుకప్పి తప్పించుకునేందుకు కొత్త మార్గాలను కనిపెడుతుంటాడు. ఒక్కోసారి చిన్నప్పుడు ఆడే దొంగ పోలీస్ ఆటను తలపించేలా పోలీసులు దొంగల మధ్య చేజింగ్స్ జరుగుతుంటాయి. అటువంటిదే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

దొంగతనం చేస్తూ పోలీసుల సైరన్ విని పారిపోయేందుకు యత్నించాడో దొంగ… చాలా దూరం పరుగు తీశాడు. ఇక తప్పించుకునే మార్గం కనిపించకపొగడంతో చెట్టెక్కి కూర్చున్నాడు. పోలీసులు కిందకి దిగాలని హెచ్చరించినా దిగేదే లేదని పైన కూర్చున్నాడు. ఇక చేసేదేమిలేక ఓ పోలీస్ ఆఫీసర్ షూ తీసి చెట్టు ఎక్కాడు. పోలీస్ పైకి ఎక్కుతుంటే దొంగ చిటారు కొమ్మల్లో ఎక్కి కూర్చున్నాడు.

ఎలాగోలా కష్టపడి కిందకు దింపి పోలీస్ స్టేషన్ కి తరలించారు. కాగా దీనికి సంబంధించిన వీడియోను దీపాంషు కాబ్రా అనే ఐపీఎస్ అధికారి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చుసిన వారిలో కొందరు ఇది దొంగ పోలీస్ ఆట అంటే, మరికొందరు కాదు కోతికొమ్మచ్చి అంటున్నారు.