Chhattisgarh : పిల్లల కడుపు నింపేందుకు టీచర్ల సాహసం.. భుజాన సరుకులతో 8 కి.మీ నడక

మన దేశం ఎంతో అభివృద్ధి చెందింది అంటారు. ప్రపంచం గుర్తించే స్థాయికి భారత్ ఎదిగిందని చెబుతారు. ఇది భారతీయులుగా మనమందరం గర్వించాల్సిన విషయమే. అయితే, దేశంలో ఇంకా పలు గ్రామాలకు కనీసం..

Chhattisgarh : పిల్లల కడుపు నింపేందుకు టీచర్ల సాహసం.. భుజాన సరుకులతో 8 కి.మీ నడక

Chhattisgarh

Chhattisgarh : మన దేశం ఎంతో అభివృద్ధి చెందింది అంటారు. ప్రపంచం గుర్తించే స్థాయికి భారత్ ఎదిగిందని చెబుతారు. ఇది భారతీయులుగా మనమందరం గర్వించాల్సిన విషయమే. అయితే, దేశంలో ఇంకా పలు గ్రామాలకు కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడం బాధాకరం. సరైన రోడ్డు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో దారి లేక కాలి నడకనే నమ్ముకున్నారు.

Amazon లో రూ.70వేల ఖరీదైన ఫోన్ ఆర్డర్‌ చేస్తే అంట్లు తోమే సోప్ పంపారు

తాజాగా ఛత్తీస్ గఢ్ లో మారుమూల గ్రామాల ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. రోడ్డు సౌకర్యం లేక అక్కడి ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారు. వారి అవస్థలను కళ్లకు అద్దం కట్టే దృశ్యం ఒకటి వెలుగుచూసింది. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో టీచర్లు తమ భుజాలపైనే వంట సరుకులు మోశారు. అలా దాదాపు 8 కిలోమీటర్లు నడిచారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.

Porn : షాకింగ్.. పోర్న్ వీడియోలకు అలవాటుపడ్డ 11ఏళ్ల బాలురు.. దానికి ఒప్పుకోలేదని బాలిక హత్య

బల్ రాంపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించేందుకు టీచర్లు చాలా కష్టపడుతున్నారు. వంట సరుకులను భుజాలపై మోస్తూ దాదాపు 8 కిలోమీటర్లు నడుస్తున్నారు. ఈ ప్రయాణంలో గుట్టలు, కాలువలను దాటుకుంటూ ముందుకెళ్తున్నారు. పిల్లలకు అన్నం పెట్టాలంటే ఈ కష్టం తప్పడం లేదని టీచర్లు వాపోయారు. కాగా, తమ గ్రామానికి రోడ్డు వేయాలని ప్రభుత్వానికి ఇప్పటికే అనేకసార్లు విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, రోడ్డు మార్గం వేసి తమ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.

కాగా, పిల్లల కడుపు నింపేందుకు ఆ ఇద్దరు టీచర్లు చేస్తున్న పోరాటాన్ని, సాహసాన్ని అంతా ప్రశంసిస్తున్నారు. వారికి సెల్యూట్ చేస్తున్నారు. దీనిపై బలరాంపూర్ జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ స్పందించారు. ”మా ఇద్దరు టీచర్లు సుశీల్ యాదవ్, పంకజ్.. రేషన్ షాపు నుంచి సరుకులు తీసుకుని కొండల్లో ఉన్న మారుమూల గ్రామానికి ఎంతో ప్రయాస పడి కాలినడకన వెళ్తారు. పిల్లల ఆకలి తీర్చాలనే వారి అంకిత భావానికి నేను సెల్యూట్ చేస్తున్నా” అని డీఈవో ఎక్కా అన్నారు.