ఆశావర్కర్ అంకిత భావం : నడుస్తూ..నది దాటి వెళ్లి ఆరోగ్య సేవలు

  • Edited By: veegamteam , September 17, 2019 / 08:26 AM IST
ఆశావర్కర్ అంకిత భావం : నడుస్తూ..నది దాటి వెళ్లి ఆరోగ్య సేవలు

ఆశావర్కర్ అంకిత భావానికి గ్రామస్తులు ప్రశంసలతో ముంచెత్తారు. ప్రజలకు సేవలందించటమే లక్ష్యంగా కాలి నడకతో నదిని దాటి వెళ్లిన మరీ ఆరోగ్యం సేవల్ని అందించిన ఆమెను చూసి భావోద్వేగానికి గురయ్యారు.  గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ సేవలు అందించటంలో ఆశా వర్కర్ల పాత్ర కీలకమైనది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించటంలో ఆశా వర్కర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మారుమూల ప్రాంతాలవాసులకు కూడా ఆశావర్కర్లు సేవలందిస్తున్నారు. ఛత్తీస్‌ఘర్‌లో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు బిల్హాపూర్‌ గ్రామంలో చుట్టూ భారీగా వరదనీరు స్థంభించిపోయిది. 

ఈ క్రమంలో గ్రామస్తులకు ఆరోగ్య సేవలు అందించటానికి నదిలో నడుచుకుంటు వెళ్లి మరీ వైద్యసేవల్ని అందించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..బిల్హాపూర్‌ గ్రామం చుట్టూ భారీగా నీరు స్థంభించిపోయి ఉంది. ఆనీరు చూసి భయపడ్డాను. కానీ నా డ్యూటీ గుర్తుకొచ్చింది. అంతే..ఏమైతే అయ్యిందని ముందడుగు వేసాను. నీటిలో దిగాను. ప్రజలకు సేవ చేయాలనే తపనే నన్ను నీటిలో నడిపించిందనీ..గ్రామస్తుల సాయంతో ఊర్లోకి వెళ్లగలిగాననీ తెలిపింది. అటువంటి పరిస్థితిలో ధైర్యం చేసి వచ్చినందుకు..గ్రామస్తులకు చికిత్స చేయడంతో చాలా సంతృప్తిగా ఉందని సంతోషంగా చెప్పిందామె. తమ కోసం నీటిలో నడిచి వచ్చిన ఆమెకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

మనసు ఉండాలే కానీ మార్గాలు అనేకం. ప్రజాసేవ చేయాలనే సంకల్పం, చేస్తున్న పనిపై అంకిత భావం రెండూ ఆమెను నదిని చేసింది.అదే పనిపట్ల ఉండాల్సిన అంకితభావం అని చాటి చెప్పింది ఆశావర్కర్. కాదు కాదు ఆశక్క.