ఆంక్షలతో చిదంబరంకి బెయిల్: మీడియాతో మాట్లాడకూడదు

  • Published By: vamsi ,Published On : December 4, 2019 / 05:23 AM IST
ఆంక్షలతో చిదంబరంకి బెయిల్: మీడియాతో మాట్లాడకూడదు

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ అర్థిక మంత్రి పి.చిదంబరంకు బెయిల్‌ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంను బెయిల్‌ కోసం ఆశ్రయించిన చిదంబరంకు అక్కడ ఊరట లభించింది.

ఈ పిటిషన్‌పై గతనెల 28వాదనలు విన్న జస్టిస్‌ ఆర్.భానుమతి, ఏఎస్ బోపన్న, హృషికేష్ రాయ్‌తో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం చిదంబరం తీహార్ జైలులో ఉన్నారు. మనీ లాండరింగ్ కేసుపై ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీన చిదంబరం అరెస్ట్‌ అయ్యారు.

105రోజులుగా జైల్లో ఉంటున్న చిదంబరం తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ బెయిల్ పిటిషన్ సుప్రీంలో దాఖలు చేశారు. 47వ (సీజేఐ)భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన శరద్ అరవింద్ బోబ్డే నేతృత్వంలోని ముగ్గురు జడ్జీల ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారించింది.

ఈ క్రమంలోనే చిదంబరంకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మీడియాతో మాట్లాడకూడదు అంటూ ఆంక్షలు విధించిన కోర్టు. అలాగే చిదంబరం పాస్ పోర్ట్ సమర్పించాలని ఆదేశించిన కోర్టు. రూ.2లక్షల పూచీకత్తుతో చిదంబరంకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.