బీజేపీ,కాంగ్రెస్ ఓటర్లకు కూడా నేనే సీఎం..ఆశీర్వదించండి మోడీజీ

  • Published By: venkaiahnaidu ,Published On : February 16, 2020 / 09:50 AM IST
బీజేపీ,కాంగ్రెస్ ఓటర్లకు కూడా నేనే సీఎం..ఆశీర్వదించండి మోడీజీ

ఢిల్లీ ప్రజల సమక్షంలో దేశరాజధాని నడ్డిబొడ్డున ఉన్న రామ్ లీలా మైదనంలో ఆదివారం(ఫిబ్రవరి-16,2020)అరవింద్ కేజ్రీవాల్ మూడవసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కేజ్రీవాల్ తో పాటు గత కేబినెట్ లో మంత్రులుగా ఉన్న ఆరుగురు మరోసారి మంత్రులుగా ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ…ఎన్నికలు ముగివాయని,మీరు ఎవరికీ ఓటు వేశారన్నది విషయం కాదు..మీరు నా కుటుంబంలో భాగం అంటూ ఢిల్లీ ప్రజలనుద్దేశించి కేజ్రీవాల్ అన్నారు. బీజేపీకి ఓట్లు వేసినవాళ్లకు,కాంగ్రెస్ కు ఓట్లు వేసినవాళ్లకు కూడా తానే సీఎం అని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ ప్రజలంతా తన కుటుంబమేనన్నారు.

ప్రమాణస్వీకారం సందర్భంగా ప్రతి ఒక్క తల్లికి,విద్యార్థికి థ్యాంక్స్ చెప్పారు కేజ్రీవాల్. క్యాంపెయిన్ సమయంలో రాజకీయాలు జరుగుతాయని,జరిగాయని అన్నారు. తనకు వ్యతిరేకంగా చాలా వ్యాఖ్యలు చేశారని,ఇప్పుడు తన పట్ట ఆ వ్యాఖ్యలు చేసినవారిని క్షమిస్తున్నానని కేజ్రీవాల్ అన్నారు. ప్రజలు నెగిటివ్ విషయాలను మర్చిపోవాలని తాను విజ్ణప్తి చేస్తున్నానన్నారు. ఢిల్లీ అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాలన్నారు. కేంద్రప్రభుత్వంతో కూడా కలిసి పనిచేస్తామని కేజ్రీవాల్ సృష్టం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. అయితే వేరే పనిమీద బిజీగా ఉండటం వల్ల ఆయన రాకపోయిఉండవచ్చని అన్నారు. ప్రమాణస్వీకార వేదికగా తనకు మోడీతో పాటు అందరి ఆశిస్సులు కావాలని కేజ్రీవాల్ అన్నారు. 

ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముందు మీ బిడ్డను ఆశీర్వదించండి అంటూ ఢిల్లీ ప్రజలనుద్దేశించి కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీ వాసులందరూ రామ్ లీలా మైదానంకి వచ్చి మీ బిడ్డను ఆశిర్వదించండి అని ఆయన ఆ ట్వీట్ లో తెలిపారు. గతంలో రెండుసార్లు కూడా రామ్ లీలా గ్రౌండ్ లోనే సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మూడోసారి అదే గ్రౌండ్ లో సీఎంగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు అరవింద్ కేజ్రీవాల్. ఈ ప్రమాణస్వీకారానికి ఏ రాజకీయనాయకులను,రాష్ట్రాల నుంచి సీఎంలను ఆహ్వానించలేదు. కేవలం ఢిల్లీ వాసులనే తన ప్రమాణస్వీకారానికి ఆహ్వానించింది ఆప్. కేజ్రీవాల్ ప్రమాణస్వీకారంలో వీఐపీలు..ఢిల్లీ ఆటోడ్రైవర్లు,క్యాబ్ డ్రైవర్లు,మెట్రో డ్రైవర్లు,పారిశుధ్య కార్మికులు. చాలా సింపుల్ గా కేజ్రీ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.

Read More>>IPL 2020 ఫుల్ షెడ్యూల్ ఇదే..