కర్ణాటక కొత్త బీజేపీ చీఫ్ గా నళిన్ కుమార్

  • Published By: venkaiahnaidu ,Published On : August 27, 2019 / 06:30 AM IST
కర్ణాటక కొత్త బీజేపీ చీఫ్ గా నళిన్ కుమార్

కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా నలిన్ కుమార్ కతీల్ నియమితులయ్యారు. 2009 నుంచి దక్షిణ కన్నడ నియోజకవర్గం నుంచి నలిన్ కుమార్ పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  సీఎం కాకముందు ఆ బాధ్యతలను యడియూరప్ప నిర్వహించిన విషయం తెలిసిందే.

కొత్తగా  రాష్ట్ర బీజేపీ చీఫ్ గా ఎన్నికైన నలిన్ కుమార్‌కు ఇవాళ(ఆగస్టు-27,2019)బెంగళూరులో సీఎం యడియూరప్ప సన్మానం చేసి సత్కరించారు. అనంతరం బీజేపీ అధ్యక్షుడిగా నలిన్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. నలిన్ కుమార్‌కు సీఎం యెడియూరప్పతో పాటు మిగతా నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

నళిన్ కుమార్ మంచి హార్డ్ వర్కర్ అని సీఎం యడియూరప్ప అన్నారు. మొత్తం ఆర్గనైజేషన్ ఆయన వెంటే ఉందన్నారు. ఆయన నాయకత్వంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి 150సీట్లు గెల్చుకుంటామని యడియూరప్ప అన్నారు.