వీపుపై తొక్కితే పిల్లలు పుడుతారంట

వీపుపై తొక్కితే పిల్లలు పుడుతారంట

Childless women let priests walk on them in hope of a baby : టెక్నాలజీ పెరుగుతోంది. కానీ మూఢ నమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. ప్రజల నమ్మకాలను ఆసరగా తీసుకుని కొంతమంది రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా వెనుకబడిన రాష్ట్రాలు, గిరిజన ప్రాబల్య రాష్ట్రాలు ఎక్కువగా వీటిని నమ్ముతుంటారు. ఆధునికయుగంలో మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్నాయి.



తాజాగా ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో ధమ్ తరీ జిల్లాలో పూజారుల చేత తొక్కించుకుంటే..పిల్లలు పుడుతారన్న నమ్మకం పెరిగిపోయింది. సంతానం లేని వారు మహిళలు బోర్లా పడుకుంటే..పూజారులు, మంత్రగాళ్లుగా చెప్పుకొనే పురుషులు వారి వీపుపై తొక్కుకుంటూ..వెళుతుంటారు. దీనికి సంబంధించిన వార్త, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.



ఛత్తీస్ గడ్ జిల్లాలోని ధమ్ తరీ జిల్లాలో మధాయి జాతర జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ జాతరకు వేలాది మంది హాజరవుతుంటారు. కరోనా విజృంభిస్తున్న వేళ కూడా..చాలా మందే ఇక్కడకు వచ్చారు. సామాజిక దూరం, మాస్క్ లు ధరించలేదు. కోవిడ్ నిబంధనలను గాలికొదిలేశారు. 52 గ్రామాల నుంచి వచ్చిన దాదాపు 200 మంది మహిళలు నేలపై బోర్లా పడుకోగా..పదుల సంఖ్యలో పూజారులు వారిని తొక్కుకుంటూ వెళ్లారు. మహిళలు పడుకోగా..వారి వీపుపై నడుచుకుంటూ వెళ్లారు.



దీనిపై ఛత్తీస్ గడ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కిరణ్మయి నాయక్ స్పందించారు. మూఢ నమ్మకాలపై వారికి అవగాహన కల్పిస్తామంటున్నారు. మత విశ్వాసాలు దెబ్బతినకుండా..తాము త్వరలోనే అవగాహన కల్పిస్తామన్నారు.