ఐదేళ్ల లోపు పిల్లల్లో పెద్దల కంటే 100 రెట్లు ఎక్కువ కరోనావైరస్: అధ్యయనం

  • Published By: vamsi ,Published On : July 31, 2020 / 01:26 PM IST
ఐదేళ్ల లోపు పిల్లల్లో పెద్దల కంటే 100 రెట్లు ఎక్కువ కరోనావైరస్: అధ్యయనం

ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వారి ఎగువ శ్వాస మార్గాలలో పెద్దల కంటే 100రెట్లు ఎక్కువ వైరల్ లోడ్ అవుతుందని అధ్యయనం చెబుతుంది. కరోనావైరస్ పెద్దలలో కంటే పిల్లలలో ఎక్కువ స్థాయిలో ఉన్నట్లుగా నిపుణులు చెబుతున్నారు.



ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు వారి ఎగువ శ్వాసకోశంలో పెద్ద మొత్తంలో కరోనావైరస్‌ను కలిగి ఉన్నారని ఒక అధ్యయనం తెలిపింది. కరోనావైరస్ వ్యాప్తికి మూలంగా పిల్లలపై డేటా చాలా తక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 669,632 మందిని చంపిన ఘోరమైన వైరస్‌కు పిల్లలు ప్రధాన కారణమని బలమైన నివేదికలు మాత్రం లేవు.

పిల్లలలో ప్రసార సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడం ప్రజారోగ్య మార్గదర్శకాలను అభివృద్ధి చేయడంలో కీలకం అని జామా పీడియాట్రిక్స్ పత్రిక అధ్యయనంలో పరిశోధకులు వెల్లడించారు. ఈ అధ్యయనంలో ఒక నెల నుండి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల 145 మంది వ్యక్తులు తేలికపాటి నుంచి మితమైన COVID-19 ఉన్నవారిని మూడు గ్రూపులుగా అధ్యయనం చేయబడ్డారు. అయితే అందులో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, 5 నుండి 17 సంవత్సరాల పిల్లలు మరియు 18 నుండి 65 సంవత్సరాల వయస్సు గల పిల్లలు.



వారి విశ్లేషణ ప్రకారం, చిన్నపిల్లలు వారి ఎగువ శ్వాస మార్గాలలో పెద్దల కంటే 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ వైరల్ లోడ్ కలిగి ఉననట్లుగా గుర్తించారు. COVID-19 ఉన్న ల్లలలో వైరల్ లోడ్లు పెద్దవారి స్థాయిలను పోలి ఉన్నాయి.