Budget 2023: రక్షణ రంగానికి పెరిగిన కేటాయింపులు.. చైనా, పాక్‌ను ఎదుర్కొనేందుకే

గత ఏడాదితో పోలిస్తే ఈ సారి నిధుల కేటాయింపు 13 శాతం ఎక్కువగా ఉంది. 2023-24కుగాను రక్షణ శాఖకు రూ.5.39 లక్షల కోట్లను కేంద్రం కేటాయించింది. గత ఏడాది ఈ కేటాయింపులు రూ.5.25 లక్షల కోట్లుగా మాత్రమే ఉంది. ప్రస్తుతం చైనాతోపాటు, పాకిస్తాన్‌ నుంచి కూడా ఇండియాకు ప్రమాదం పొంచి ఉంది.

Budget 2023: రక్షణ రంగానికి పెరిగిన కేటాయింపులు.. చైనా, పాక్‌ను ఎదుర్కొనేందుకే

Budget 2023: కేంద్రం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రక్షణ శాఖకు ఈసారి భారీ స్థాయిలో నిధులు కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి నిధుల కేటాయింపు 13 శాతం ఎక్కువగా ఉంది. 2023-24కుగాను రక్షణ శాఖకు రూ.5.39 లక్షల కోట్లను కేంద్రం కేటాయించింది.

Budget 2023: ఏపీలో యూనివర్సిటీలకు నిధులు.. తాజా కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు ఇవే

గత ఏడాది ఈ కేటాయింపులు రూ.5.25 లక్షల కోట్లుగా మాత్రమే ఉంది. ప్రస్తుతం చైనాతోపాటు, పాకిస్తాన్‌ నుంచి కూడా ఇండియాకు ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో దేశ రక్షణ వ్యవస్థను మెరుగుపర్చుకోవడం చాలా అవసరం. అందుకే జాతీయ భద్రత దృష్ట్యా రక్షణ రంగానికి గత ఏడాదికంటే ఈసారి భారీ స్థాయిలో నిధుల్ని కేటాయించింది కేంద్రం. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో అనేక దేశాలు రక్షణ రంగ బడ్జెట్ కేటాయింపుల్ని పెంచుతున్నాయి. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా భారీగా నిధుల్ని కేటాయిస్తున్నాయి. తాజా బడ్జెట్ కేటాయింపుల ద్వారా సరిహద్దు వెంట నిర్మాణాలు చేపట్టడం, మౌలిక వసతులు కల్పించడం వంటివి చేస్తారు.

Budget 2023: క్రీడారంగానికి పెద్దపీట వేసిన బడ్జెట్.. గతంకంటే ఎక్కువ కేటాయింపులు

హిమాలయాల్లో చైనా ఆక్రమణను అడ్డుకోవడంపై కూడా దృష్టి పెడతారు. సరిహద్దు వెంట భద్రత మరింత కట్టుదిట్టం చేయాలంటే ఆ ప్రాంతంలో రోడ్లు నిర్మించడం వంటి మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. ముఖ్యంగా ఉత్తర సరిహద్దును బలోపేతం చేయాలి. దీనిలో భాగంగా సరిహద్దులో రోడ్ల నిర్మాణానికి (బీఆర్ఓ) రూ.5,000 కోట్లు కేటాయించారు. గత ఏడాది దీని వాటా రూ.3,500 కోట్లుగా ఉంది. అయితే, రక్షణ రంగానికి నిధులు కేటాయింపు ఎంతగా పెంచినప్పటికీ అది అవసరానికి తగిన స్థాయిలో సరిపోదని నిపుణులు అంటున్నారు.