China India Border: చైనా బరితెగింపు: ఎల్ఏసీ వెంట మొబైల్ టవర్ల ఏర్పాటు
ల్ఏసీ వెంట హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో మూడు మొబైల్ టవర్లను చైనా నిర్మించినట్లు ఛుషూల్ ప్రాంత కౌన్సిలర్ కొంచెక్ స్టాంజిన్ పేర్కొన్నారు

China
China India Border: వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట చైనా దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పక్కలో బల్లెంలా భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్న చైనా..ఆమేరకు భారత్ చైనా సరిహద్దుల్లో అక్రమ నిర్మాణాలకు పాల్పడింది. కరోనా లాక్ డౌన్ సమయంలో పాంగాంగ్ సరస్సుపై చైనా చేపట్టిన వంతెన నిర్మాణం దాదాపు పూర్తయినట్లు తెలుస్తుంది. మరోవైపు ఎల్ఏసీ వెంట హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో మూడు మొబైల్ టవర్లను చైనా నిర్మించినట్లు ఛుషూల్ ప్రాంత కౌన్సిలర్ కొంచెక్ స్టాంజిన్ పేర్కొన్నారు. సరిహద్దు వెంట చైనా శరవేగంగా చేపడుతున్న నిర్మాణాలపై ఆందోళన వ్యక్తం చేసిన కొంచెక్ స్టాంజిన్, దీనిపై భారత ప్రభుత్వం స్పందించాలని కోరారు.
Also read:India Poverty : భారత్లో భారీగా తగ్గిన పేదరికం.. 10శాతం పెరిగిన రైతుల ఆదాయం-వరల్డ్ బ్యాంక్
నివాసయోగ్యమైన కొన్ని గ్రామాలలో ఇక్కడ తమకు 4జీ సౌకర్యం కూడా లేదని స్టాంజిన్ ఆవేదన వ్యక్తం చేశారు. సరిహద్దు వెంట చైనా చేపట్టిన నిర్మాణాలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ ఫిబ్రవరిలో లోక్సభలో మాట్లాడుతూ “పాంగోంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న వంతెనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళామని, 1962 నుండి చైనా అక్రమ ఆక్రమణలో కొనసాగుతున్న ప్రాంతాల్లోనే చైనా ఈ వంతెనను నిర్మించినట్లు” పేర్కొన్నారు. మరోవైపు రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ “భారత్ కు హాని తలపెట్టే ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని” చైనాను ఉద్దేశించి గట్టి వ్యాఖ్యలు చేశారు.
Also read:Amrnath Yatra: అమర్నాథ్ యాత్ర కోసం ఇప్పటి వరకు 33,795 మంది నమోదు: కొనసాగుతున్న బుకింగ్