చైనాకు దలైలామా వార్నింగ్: నా వారసుడు భారతీయుడే

  • Published By: veegamteam ,Published On : March 19, 2019 / 06:21 AM IST
చైనాకు దలైలామా వార్నింగ్: నా వారసుడు భారతీయుడే

భారత సరిహద్దు దేశమైన చైనాకు బౌద్ధమత గురువు దలైలామా వార్నింగ్ ఇచ్చారు. ధర్మశాలలో మీడియాతో మాట్లాడిన ఆయన..తాను మరణించిన తరువాత..తన వారసుడిగా ఎవరినో చైనా తెరపైకి తేవాలని చూస్తుందని..అతన్ని టిబెట్ బౌద్ధులు గౌరవించే పరిస్థితి ఉండదని..ఇండియా నుంచే తన వారసుడు రానున్నాడని స్పష్టం చేశారు. సరిహద్దు ప్రాంతమైన టిబెట్ రాజధాని లాసా నుంచి చైనా నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని తప్పించుకుని..1959లో తాను ఇండియాకు వచ్చానని..ఆనాటి నుంచీ ప్రపంచదేశాల మద్దతుతో తన భూభాగమైన టిబెట్  కోసం పోరాడుతూనే ఉన్నానని  దలైలామా తెలిపారు. 
Read Also : వైసీపీది నేరగాళ్ళ ప్రకటన : టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు

చైనాకు తెలుసు నా వారసుడి ఎంపిక చాలా కీలకమని..ఈ విషయంలో నాకన్నా చైనా చాలా ఆసక్తి ఉందనీ కానీ.. నా వారసుడు ఇండియా నుంచే వస్తాడని ఆయన పేర్కొన్నారు.  భవిష్యత్తులో ఇద్దరు దలైలామాలు కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదనీ..చైనా దలైలామాను తెరపైకి తీసుకొచ్చినా అతన్ని నమ్మే పరిస్థితి ఎంతమాత్రం ఉండదనీ..ఆపై అది చైనాకు అదనపు సమస్యగా మారుతుంది” అని దలైలామా  ఈ సందర్భంగా చైనాను  హెచ్చరించారు. 

దలైలామా వారసుడి విషయంలో టిబెటన్ల నమ్మకం 
దలైలామా వారసుడి ఎంపిక హక్కు తమదేనని చైనా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. టిబెటన్ల నమ్మకం ప్రకారం, దలైలామా మరణిస్తే, ఆయన ఆత్మ ఓ చిన్నారిలోకి ప్రవేశిస్తుంది. ఆ చిన్నారిని గుర్తించే ప్రక్రియను బౌద్ధ గురువులు పూర్తి చేసి, వారసుడిని ప్రకటిస్తారు. 1935లో జన్మించిన ప్రస్తుత దలైలామాను, ఆయన రెండేళ్ల వయసులో ఉండగానే మతగురువులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన 14వ లామాగా కొనసాగుతూ, వయసు పైబడిన కారణంగా వచ్చే సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత దలైలామా 
టిబెట్ ను 1950లో ఆక్రమించిన చైనా..దలైలామాను ప్రమాదకర వేర్పాటువాదిగా అభివర్ణించింది. ఆనాటి నుంచి ఆయన ఇండియాలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం 83 సంవత్సరాల వయసులో ఉన్న దలైలామాను నోబెల్ శాంతి బహుమతి వరించిన సంగతి తెలిసిందే. 
Read Also : అసలేం జరిగింది : యువజంట సజీవ దహనం