Arunachal Pradesh : బరితెగించిన డ్రాగన్..అరుణాచల్ లో మరో 15 గ్రామాలకు చైనా పేర్లు

డ్రాగన్ మరోసారి దందుడుకు చర్యకు పాల్పడింది. భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తమ భూభాగమని చాలా ఏళ్లుగా వాదిస్తోన్న చైనా

Arunachal Pradesh : బరితెగించిన డ్రాగన్..అరుణాచల్ లో మరో 15 గ్రామాలకు చైనా పేర్లు

China

Arunachal Pradesh : డ్రాగన్ మరోసారి దందుడుకు చర్యకు పాల్పడింది. భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తమ భూభాగమని చాలా ఏళ్లుగా వాదిస్తోన్న చైనా..తాజాగా అరుణాచల్ ప్రదేశ్​లో మరో 15 ప్రాంతాలకు అధికారిక చైనీస్ పేర్లు పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ 15 ప్రాంతాల్లో 8 నివాస ప్రాంతాలు కాగా… 4 పర్వతాలు, రెండు నదులు, ఓ పర్వత మార్గం ఉన్నాయి. ఈ 15 ప్రాంతాలకు చైనీస్​, టిబెటన్, రోమన్ ఆల్పబెట్​లతో అధికారిక పేర్లు పెట్టినట్లు చైనా అధికారిక వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ ఓ కథనంలో తెలిపింది.

8 నివాసిత ప్రాంతాలను… స్నగ్​కెజాంగ్​, దగ్లుంగ్​ జాంగ్​, మనిగాంగ్​, డుడింగ్, న్యింగ్​చి, గోలింగ్​, డంబా, మెజాగ్​గా నామకరణం చేసింది. నాలుగు పర్వతాలకు వామో రి, డు రి, లన్​జుబ్​ రి, కున్​మింగ్​జింగ్​ ఫెంగ్​ అని నామకరణం చేసింది. అలాగే రెండు నదులకు జెన్​యోగ్మో, దులైన్​ అని.. పర్వత మార్గాన్ని ‘సె లా’ అని పేరు పెట్టింది.

అయితే అరుణాచల్​ ప్రదేశ్​లోని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడం ఇది రెండోసారి. 2017లో కూడా ఇలాగే ఆరు ప్రాంతాలకు తమ అధికారిక పేర్లు పెట్టింది. కాగా,ఇప్పటికే అరుణాచల్​ ప్రదేశ్​ను చైనా… ‘జన్​గ్నాన్​’ అని చైనీస్​ పేరుతోనే పిలుస్తోన్న విషయం తెలిసిందే.

ALSO READ Tiger Population 2021: భారత్ లో ఆందోళనకర స్థాయిలో పెద్ద పులుల మృత్యువాత