ఏం జరుగుతోంది : ఇండో-పాక్ సరిహద్దుల దగ్గర భారీగా చైనా బలగాలు

  • Published By: venkaiahnaidu ,Published On : March 21, 2019 / 03:14 PM IST
ఏం జరుగుతోంది : ఇండో-పాక్ సరిహద్దుల దగ్గర భారీగా చైనా బలగాలు

పాక్ లోని సింధ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున చైనా సైనిక బలగాలను మెహరించింది. చైనా-పాక్ ఎకనామిక్ కారిడర్(CPEC)కాపాడుకోవడానికే చైనా సైన్యం సింథ్ లో మొహరించినట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు తెలిపాయి.ముఖ్యంగా సింధ్‌ ఫ్రావిన్స్ లోని థార్ ప్రాంతంలో బొగ్గు గనుల భద్రత కోసం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీరంగంలోకి దిగినట్టు సమాచారం. థార్‌ పార్కర్ జిల్లాలో ఉన్న థార్ ప్రాంతం…భారత్-పాక్ సరిహద్దుకు కేవలం 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

సింధ్‌ లో చైనా చేపడుతున్న అనేక ప్రాజెక్టులను స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఇలాంటి ఆందోళన నుంచి సీపెక్ ప్రాజెక్టులను కాపాడుకోవడానికి తమ బలగాలను చైనా మొహరించినట్లు తెలుస్తోంది.ఇండో-పాక్ బోర్డర్ కి దగ్గర్లో మొహరించబడి ఉన్న చైనా బలగాల కదలికలను బీఎస్ఎఫ్ గమనిస్తూనే ఉందని,సింధ్,బలూచిస్తాన్ ప్రాంతాల్లో చేపడుతున్న చైనా ప్రాజెక్టుల పట్ల స్థానికులు నిరసన తెలుపుతున్నారన్న ఉద్దేశ్యంతోనే చైనా తమ బలగాలను అక్కడ మొహరించిందని ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు తెలిపారు.

సీపెక్ ప్రాజెక్టు దాదాపు 3 వేల కిలోమీటర్ల మేర ఉండగా…దీనికోసం పాక్ ఇప్పటికే 17 వేల మంది సైనికులను మోహరించింది. ఈ 17 వేల మందిలో 4 వేలమంది పాకిస్తాన్ ప్రత్యేక దళాలకు చెందిన వారే ఉన్నారు. 

గతేడాది జులైలో చైనాలో పర్యటించిన పాక్ ఆర్మీ చీఫ్ చైనా ప్రధాని,ఉపాధ్యక్షుడితో సమావేశమయ్యారు.ఈ మీటింగ్ సమయంలో సీపెక్ కు సెక్యూరిటీ కల్పిస్తున్నందుకు పాక్ ఆర్మీకి చైనా కృతజ్ణతలు తెలిపింది.సీపెక్ కు ఫుల్ సెక్కూరిటీ కల్పిస్తామని ఈ మీటింగ్ సందర్భంగా పాక్ చైనాకు హామీ ఇచ్చింది.అయితే పాక్ పై నమ్మకం లేకనే తమ దళాలను కూడా పంపాలని చైనా నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.