China-India: వాస్తవాధీన రేఖ వెంబడి కొనసాగుతున్న చైనా కవ్వింపు చర్యలు

భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది చైనా. భారత్ పై ఎప్పుడైనా యుద్ధానికి దిగొచ్చంటూ భారీగా సైన్యాన్ని రంగంలోకి దింపింది చైనా.

China-India: వాస్తవాధీన రేఖ వెంబడి  కొనసాగుతున్న చైనా కవ్వింపు చర్యలు

China

China-India: సరిహద్దు వద్ద చైనా దుందుడుకుగా వ్యవహరిస్తోంది. భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత్ పై ఎప్పుడైనా యుద్ధానికి దిగొచ్చంటూ భారీగా సైన్యాన్ని రంగంలోకి దింపింది చైనా. భారత సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరిస్తోన్న చైనా.. ఈమేరకు సరిహద్దుల్లో 60 వేల మంది సైనికులను మోహరింపజేసింది. ఇరు దేశాల మధ్య వివాదాస్పద ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపరుచుకుంటుంది. ఇప్పటికే పాంగాంగ్​ సరస్సుపై వంతెన నిర్మిస్తోన్న చైనా, రోడ్లు, సమాచార వ్యవస్థ, ఇతర సదుపాయాలను యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేస్తుంది. పాంగాంగ్​ సరస్సుపై చైనా నిర్మిస్తున్న వంతెన అందుబాటులోకి వస్తే.. సైనిక బలగాల తరలింపు సులభంగా ఉంటుంది. ఆయుధ సామగ్రిని, ఆహారాన్ని సరఫరా చేసుకునేందుకు చైనాకు సులభంగా ఉంటుంది. భారత్ సరిహద్దు వద్ద చైనా ఇటీవల నిర్మించిన ఫార్వార్డ్ ఆపరేషనల్ బేస్ (FOB) క్యాంపులలో క్షిపణులను, ఆయుధాలను దాచినట్లు భారత సైనిక నిఘావర్గాలు గుర్తించాయి.

Also read: National Politics: 6 రోజుల వ్యవధిలో బీజేపీ నుంచి సొంతగూటికే చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

ఇక చైనాకు ధీటుగా భారత్ సిద్ధం అవుతుంది. సరిహద్దుల వెంట భారీగా సైన్యాన్ని మోహరించింది భారత్. వాస్తవాధీన రేఖ వెంబడి బలగాలు, భారీ ఆయుధ సంపత్తిని వేగంగా తరలించేందుకు వీలుగా భారత్ సైతం మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేస్తుంది. ఏక్షణానైనా చైనా సైనికులు దాడికి పాల్పడితే ధీటుగా బదులిచ్చేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉంది. కైలాష్ పర్వత శిఖరాలపై పైచేయి సాధించిన భారత సైన్యం.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రాంతాన్ని చేజారనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంది.

Also Read: Viral News:15 నిముషాల తేడాతో ఏడాది దాటేసిన కవలలు