India-China Border Clash At LAC : చైనా దాడిని మోడీ ఎప్పటికీ అంగీకరించరు..అరుణాచల్ ఘటనపై కూడా ఓ కొత్త కథ చెబుతారు : MP అసదుద్దీన్ ఓవైసీ
చైనా దాడిని మోడీ ఎప్పటికీ అంగీకరించరు..దీని గురించి కొత్త కథ చెబుతారు అంటూ అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ వద్ద భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణ జరిగిన ఘటనపై MP అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు చేశారు.

India-China Border Clash At LAC : అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ వద్ద (డిసెంబర్ 9,2022) భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పార్లమెంట్ లో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. విషయాన్ని సభాముఖంగా చెప్పాలని డిమాండ్ చేశాయి. ఈ ఘటనపై బీజేపీ ప్రభుత్వంపై AIMIM chief, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. ఇటువంటి ఘటనలపై చైనా గత అనుభవాల నుంచి నేర్చుకుంది..కానీ ప్రధాని మోడీ మాత్రం చైనా దాడి విషయాన్ని ఎప్పటికీ అంగీకరించరని..భారత భూభాగంపై చైనా దాడి విషయంలో ప్రధాని మోడీ ఓ కొత్త కథ చెబుతారు అంటూ ఎద్దేవా చేశారు. ఏ విషయాన్ని అయినా స్టోరీలుగా మార్చి చెప్పటం ఆయనకు అలవాటని ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన ఘటనను కూడా ఓ స్టోరీలాగా వినిపిస్తారు మోడీ అంటూ ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ..2022 ఆగస్టులో చైనా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో 75 శాతం దళాలను పెంచింది అంటూ వివరించారు. డోక్లాం, దెసాంగ్, గల్వాన్, డెమ్‌చోక్‌ల్లో జరిగిన ఘటనల అనుభవాల నుంచి చైనా నేర్చుకుందని..కానీ ప్రధాని మోడీ మాత్రం ఈ దాడిని ఎన్నటికీ అంగీకరించరని, పైగా తన స్నేహపూర్వక మీడియా ద్వారా డ్రాగన్ దాడికి భిన్న అర్ధాలు చెప్పుకొస్తారు అంటూ ఓవైసీ ట్వీట్లర్ ద్వారా ఎద్దేవా చేశారు. చైనా ఎటువంటి సౌండ్ లేకుండా కూల్ గా తనపని తాను చేసుకుపోతుందని..భారత భూభాగాన్ని ఆక్రమిస్తూనే ఉందని కానీ మోడీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం మాత్రం చూస్తు ఊరుకుంటుంది అంటూ విమర్శించారు.