China Army : భారతీయ యువకుడిని అపహరించిన చైనా ఆర్మీ

2018 లోనే అరుణాచల్ ప్రదేశ్ లోని పలు సరిహద్దు ప్రాంతాలను చైనా తమవిగా ప్రకటించింది.

China Army : భారతీయ యువకుడిని అపహరించిన చైనా ఆర్మీ

China Army

China Army : చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ- PLA.. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడిని భారత భూభాగం నుంచి అపహరించింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం సియాంగ్ జిల్లా సుయుంగ్లా-లుంగ్తా జోర్ ఏరియాలో ఈ సంఘటన జరిగింది. చైనా ఆర్మీ చర్యను అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎంపీ తపిర్ గావ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

చైనా పీఎల్ఏ బలగాలు అపహరించిన ఆ టీనేజీ యువకుడి పేరు Sh మిరమ్ తరోన్. వయసు 17 ఏళ్లు. అరుణాచల్ ప్రదేశ్ జిడో అతడి సొంత ఊరు. జనవరి 18, 2022 నాడు భారత సరిహద్దుకు లోపలే ఉన్న భూభాగం నుంచి బిషింగ్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఇద్దరు యువకులను ఆర్మీ అపహరించింది. ఐతే.. మిరమ్ తరోనా స్నేహితుడు చైనా బలగాల నుంచి తప్పించుకుని వచ్చేశాడు. ఈ విషయాన్ని స్థానిక అధికారులకు తెలియజేశాడు.

కేంద్రప్రభుత్వం ఈ విషయంపై వెంటనే స్పందించాలని ట్విట్టర్ లో కోరారు ఎంపీ తపిర్ గావ్. వీలైనంత తొందరగా మిరమ్ తరోన్ విడుదలయ్యేలా చూడాలన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎన్.ప్రమాణిక్ తో దీనిపై మాట్లాడారు ఎంపీ.

Read This : Corona Alert : థర్డ్ వేవ్ పంజా.. నిన్న 3లక్షలకు పైగా కేసులు నమోదు

2018 లోనే అరుణాచల్ ప్రదేశ్ లోని పలు సరిహద్దు ప్రాంతాలను చైనా తమవిగా ప్రకటించింది. భారత భూభాగంలోనే 3 నుంచి 4 కిలోమీటర్ల రోడ్డును నిర్మించింది. కిడ్నాప్ ఘటన జరిగిన సియుంగ్లా- లుంగ్తా జోర్ ఏరియా చైనా రోడ్లు వేసిన ఈ ప్రాంతంలోనే ఉంది. ఇప్పటికే అరుణాచల్ బోర్డర్ లోని 15 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టేసిందనీ.. ఈ మొత్తం ఏరియాకు సౌత్ టిబెట్ గా నామకరణం చేసిందని తెలుస్తోంది. అరుణాచల్ లోని 90వేల చదరపు కిలోమీటర్ల భూభాగం తమదేనని ఇప్పటికే ప్రకటించిన చైనా.. దానికి జంగ్నన్ అని పేరు పెట్టేసింది.

Read This : Virat Kohli: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ