తగులబెట్టేస్తాం: హోలీ వేడుకల్లో చైనా ప్రొడక్ట్స్ బ్యాన్

  • Published By: veegamteam ,Published On : March 20, 2019 / 04:22 AM IST
తగులబెట్టేస్తాం: హోలీ వేడుకల్లో చైనా ప్రొడక్ట్స్ బ్యాన్

ఢిల్లీ: భారతదేశంలో పండుగలు ఏవైనా మార్కెట్ లో చైనా ఉత్పత్తులు హల్ చల్ చేస్తుంటాయి. ఈ క్రమంలో  హోలీ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని వ్యాపారులు వినూత్నంగా వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో చైనాకు సంబంధించిన ఏ వస్తువులను..(రంగులు)వినియోగించకూడదని నిర్ణయించుకున్నారు. కారణం..భారత్ లో పాకిస్థాన్ ఉగ్రదాడి..అనంతరం ప్రతీకారంగా భారత్ పాక్ పై సర్జికల్ దాడుల క్రమంలో పాకిస్థాన్ కు చైనా వంత పాడుతోందనీ..అందుకే చైనా ఉత్పత్తులను నిషేధిస్తున్నామని ఢిల్లీ వ్యాపారులు తెలిపారు.
 

ఈ క్రమంలో భారత్ లోని హోలీ వేడుకల ప్రభావం చైనా మార్కెట్ పై పడనుంది. చైనా మనదేశంలో వ్యాపారం సాగిస్తూనే..పాకిస్తాన్‌కు మద్దతు పలుకుతున్నదని పలువురు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. చైనా తీరును వ్యతిరేకిస్తూ దేశంలోని వందలాది ప్రాంతాల్లో చైనా వస్తువులను హోలికా దహనంలో వేస్తామని వ్యాపారుల సంఘం ప్రతినిధి తెలిపారు.  చైనా వస్తువుల కారణంగా భారత్‌లోని పలు వ్యాపారసంస్థలకు నష్టం వాటిల్లుతోందనీ..దీనికితోడు భారత్ పై కక్ష కట్టిన పాకిస్తాన్‌కు మద్దతు పలుకుతున్న చైనాకు తగిన బుద్ధి చెప్పాలని..ఈ రకంగా తమ నిరసనలు తెలియజేస్తున్నామనీ వ్యాపారులు తెలిపారు.