భారత్ కు ఆక్సిజన్ సరఫరా చేసే కార్గో విమానాలను రద్దు చేసిన చైనా

భారత్​కు 15 రోజులపాటు కార్గో విమానాలను రద్దు చేస్తున్నట్లు చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిచువాన్​ ఎయిర్​లైన్స్ ప్రకటించింది.

భారత్ కు ఆక్సిజన్ సరఫరా చేసే కార్గో విమానాలను రద్దు చేసిన చైనా

Chinas Airline Suspends Cargo Flights Bringing Medical Supplies To India

Sichuan Airlines భారత్​కు 15 రోజులపాటు కార్గో విమానాలను రద్దు చేస్తున్నట్లు చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిచువాన్​ ఎయిర్​లైన్స్ ప్రకటించింది. భారత్​లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. చైనా నుంచి భారత్​కు నడిచే ఢిల్లీ సహా ఆరు రూట్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంటూ సేల్స్​ ఏజెంట్లకు సిచువాన్​ ఎయిర్​లైన్స్​ సంస్థ సోమవారం లేఖ రాసింది.

సిచువాన్ ఎయిర్​లైన్స్​ తాజా నిర్ణయంతో చైనా నుంచి భారత్​కు ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు, ఇతర ఔషధాలు చేరవేయడంలో ప్రైవేటు వాణిజ్యదారులు చేస్తున్న కృషికి తీవ్ర అంతరాయం కలగనుంది. అయిత, అంతకుమందు కరోనాపై పోరాటంలో భారత్​కు తాము సహాయ, సహకారాలను అందిస్తామని చైనా ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.

సిచువాన్​ ఎయిర్​లైన్స్ నిర్ణయంతో చైనా నుంచి భారత్​కు ఆక్సిజన్​ను సరఫరా చేయడం.. సవాలుగా మారనుంది. సింగపూర్​ లేదా ఇతర దేశాల మీదుగా వేరే ఎయిర్​లైన్స్​ ద్వారా భారత్​కు రవాణా చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఆక్సిజన్ మనదేశానికి చేరుకునేందుకు చాలా ఆలస్యమవునుంది. అంతే కాకుండా, చైనాలోని ఆక్సిజన్​ తయారీదారులు..ధరలను 35 నుంచి 40 శాతానికి పెంచారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సరుకు రవాణా ఛార్జీలనూ చైనా ప్రభుత్వం 20 శాతానికి పెంచిందని సమాచారం.