భారత్ లోని ముఖ్యమైన కాంట్రాక్ట్ దక్కించుకున్న చైనా కంపెనీ

భారత్ లోని ముఖ్యమైన కాంట్రాక్ట్ దక్కించుకున్న చైనా కంపెనీ

Chinese firm bags contract భారత్ లో మరో కీలకమైన కాంట్రాక్టుని చైనా కంపెనీ దక్కించుకుంది. ఢిల్లీ-మీరట్ రిజినల్ రాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్(RRTS)ప్రాజెక్టులోని 5.6కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ టన్నెల్(సొరంగం)అభివృద్ధి చేసే కాంట్రాక్టుని చైనా కంపెనీ “షాంఘై టన్నెల్ ఇంజినీరింగ్ కంపెనీ”దక్కించుకుంది. న్యూ అశోక్ నగర్ నుంచి షాహీదాబాద్ వరకు 5.6కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మించే కాంట్రాక్టుని…భారతదేశపు మొట్టమొదటి RRTS ప్రాజెక్టుని నిర్వహిస్తున్న ది నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్ పోర్ట్(NCRTC)…షాంఘై టన్నెల్ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్(STEC)కి అప్పగించింది.

బహుపాక్షిక ఏజెన్సీల ద్వారా నిధులు సమకూర్చే బిడ్ల కోసం వివిధ స్థాయిలలో ఆమోదాలు తీసుకోవాల్సి ఉంటుందని..ఈ బిడ్ కూడా ఏర్పాటుచేసిన విధానాలు,నిబంధనలు పాటించిందని NCRTC ఓ ప్రకటనలో తెలిపింది. 82 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్ అన్ని టెండర్లు ఇవ్వబడ్డాయని,ప్రాజెక్టుని సకాలంతో పూర్తిచేసేలా పూర్తిస్థాయిలో వేగంగా నిర్మాణం పని జరుగుతోందని NCRTC తెలిపింది.

ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్ ప్రాజెక్టుకి ది ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్(ADB)నిధులు సమకూరుస్తోంది. ప్రభుత్వం మరియు బ్యాంకు గైడ్ లైన్స్ కి అనుగుణంగా నిధుల సేకరణ జరుగుతోంది. గైడ్ లైన్స్ ప్రకారం.. ఎటువంటి వివక్ష లేకుండా ADBలోని సభ్యదేశాలకు చెందిన విక్రేతలు బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హత పొందుతారు. ఇందులో భాగంగానే ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్ లో న్యూ అశోక్ నగర్ నుంచి షాహీదాబాద్ వరకు అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మించేందుకు నవంబర్-9,2019న NCRTC బిడ్స్ ని ఆహ్వానించింది.

మొత్తం 5 కంపెనీలు టెక్నికల్ బిడ్స్ ని సమర్పించగా..మొత్తం 5 టెక్నికల్ బిడ్ ఎవాల్యువేషన్ లో క్వాలిఫై అయ్యాయి. ఈ 5 కంపెనీలలో చైనా సంస్థ షాంఘై టన్నెల్ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్..అన్ని ప్రమాణాల్లో అర్హత పొందాక టెండర్ కి తక్కువధరకు కోట్ చేసిన బిడ్డర్ గా నిలిచి కాంట్రాక్ట్ దక్కించుకుంది.