Jammu & Kashmir: జమ్మూ-కాశ్మీర్‌లో భారీ సంఖ్యలో ఆయుధాలు స్వాధీనం.. పాక్, చైనా నుంచి దిగుమతైన ఆయుధాలు

జమ్మూలోని యురి సెక్టార్, బారాముల్లా జిల్లాలో ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ కల్నల్ మనీష్ పంజ్ తెలిపారు. ఇటీవలి కాలంలో లభించిన భారీ ఆయుధ డంపింగ్ ఇదే. తీవ్రవాద కట్టడి చర్యలు తీసుకుంటున్న సైన్యం, పోలీసులు నిరంతరం ఇక్కడ నిఘా పెడుతున్నారు.

Jammu & Kashmir: జమ్మూ-కాశ్మీర్‌లో భారీ సంఖ్యలో ఆయుధాలు స్వాధీనం.. పాక్, చైనా నుంచి దిగుమతైన ఆయుధాలు

Jammu & Kashmir: జమ్ము-కాశ్మీర్ లోయలో భారత సైన్యం భారీ అక్రమ ఆయుధ నిల్వల్ని స్వాధీనం చేసుకుంది. జమ్మూలోని యురి సెక్టార్, బారాముల్లా జిల్లాలో ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ కల్నల్ మనీష్ పంజ్ తెలిపారు. ఇటీవలి కాలంలో లభించిన భారీ ఆయుధ డంపింగ్ ఇదే. తీవ్రవాద కట్టడి చర్యలు తీసుకుంటున్న సైన్యం, పోలీసులు నిరంతరం ఇక్కడ నిఘా పెడుతున్నారు.

United States: అమెరికాలో మంచు తుపాన్ ధాటికి 18 మంది మృతి.. కరెంటు లేక చీకట్లోనే 17 లక్షల మంది

తీవ్రవాదుల్ని, వారితో సంబంధం ఉన్న వ్యక్తుల్ని అరెస్టు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇటీవల ఆర్మీ అధికారులు హిజ్బుల్ ముజాహిద్దీన్ అనే తీవ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఆయుధాల్ని నిల్వ చేసిన విషయాన్ని వెల్లడించారు. వాళ్లిచ్చిన సమాచారంతో సోదాలు నిర్వహించగా, భారీ ఆయుధ సామగ్రి బయటపడింది. కొత్తగా నిర్మాణమవుతున్న రెండు ప్రదేశాల్లో వీటిని దాచి ఉంచారు. ఇవి తీవ్రవాదులు దాక్కునేందుకు, వారు ఉపయోగించేందుకు ఏర్పాటు చేశారు. పాకిస్తాన్‌కు చెందిన ఫరూక్ అహ్మద్ పిర్ అనే తీవ్రవాది సూచన మేరకు ఈ పని చేసినట్లు అరెస్టైన సానుభూతిపరులు తెలిపారు.

ఫరూక్ ద్వారానే ఈ ఆయుధాలు రవాణా జరుగుతున్నట్లు గుర్తించారు. తాజాగా ఆర్మీ స్వాధీనం చేసుకున్న వాటిలో 8 ఏకేఎస్ 74 రైఫిళ్లు, 24 మ్యాగజైన్లు, 560 లైవ్ రైఫిల్ రౌండ్స్, 12 చైనా పిస్టల్స్, 24 మ్యాగజైన్స్, 224 లవ్ పిస్టల్ రౌండ్స్, పాకిస్తాన్, చైనాకు చెందిన గ్రేనేడ్స్, పాక్ జెండా ఉన్న 81 బెలూన్లు ఉన్నాయి.