యుద్ధ వాతావరణం, యుద్ధ విమానాలు, బాలిస్టిక్ క్షిపణులను మోహరించిన చైనా

  • Published By: madhu ,Published On : September 10, 2020 / 08:58 AM IST
యుద్ధ వాతావరణం, యుద్ధ విమానాలు, బాలిస్టిక్ క్షిపణులను మోహరించిన చైనా

భారత్ – చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే..యుద్ధ వాతావరణం నెలకొంది. పాంగాంగ్ కు భారీగా బలగాలను తరలిస్తోంది చైనా. ఫింగర్ 3 వద్ద కొత్త స్థావరాలను ఏర్పాటు చేసుకుందని భారత ఆర్మీ గుర్తించింది.



ఆయుధాలు, యుద్ధ విమానాలు, బాలిస్టిక్ క్షిపణులు, రాకెట్లను తరలించింది. తూర్పు లద్దాఖ్ లో సుమారు 50 వేల మంది సైనికులున్నట్లు సమాచారం. 150 యుద్ధ విమానాలను మోహరించింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రయత్నాలను భారత్ నిశితంగా పరిశీలిస్తూనే..ధీటుగా స్పందిస్తోంది. అక్కడి సైనికుల చర్యలను తిప్పికొడుతోంది.
https://10tv.in/post-galwan-clash-indian-navy-deploys-warship-to-south-china-sea-report/
రెజాంగ్ లా దగ్గర 5 వేల మీటర్ల ఎతున్న శిబిరాలు ఏర్పాటు చేసి భారత్ సైన్యం మోహరించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడిస్తోంది. సరిహద్దులో అదనపు సైన్యాన్ని తరలించింది. సుఖోయ్, మిగ్ యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి.



ఒకవైపు సైనిక కమాండర్ల స్థాయిలో సంప్రదింపులు జరుగుతుండగా.. మరోవైపు డ్రాగన్‌ భారత్‌ను దొంగదెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తోంది. ఈనెల ఏడో తేదీన తూర్పు లడఖ్‌లో పీఎల్‌ఏ దళాలు భారత భూభాగం వైపు చొచ్చుకువచ్చి గాలిలోకి కాల్పులు జరిపాయి. వెంటనే భారత్‌ దీటుగా బదులివ్వడంతో చైనా తోకముడిచింది.



సరిహద్దుల్లో శాంతి వాతావరణం నెలకొనేలా చూడాలని ఇరుదేశాల రక్షణ శాఖల మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, జనరల్‌ వీ ఫెంగ్‌ నిర్ణయించిన మూడు రోజులకే డ్రాగన్ కాల్పులకు తెగబడింది. లద్దాఖ్‌లో వాస్తవాధీనరేఖ వెంట భారత సైనికులపై గల్వాన్‌ తరహా దాడికి చైనా సైనికులు విఫలయత్నం చేశారు.

ఈటెలు, రాడ్లు, పదునైన ఆయుధాలతో భారత్‌కు చెందిన ముఖ్‌పరీ పోస్టువైపు దూసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత్‌-చైనా మధ్య సరిహద్దుగా ఉన్న ఎల్‌ఏసీ వద్ద దాదాపు 45 ఏండ్ల తర్వాత తుపాకులు గర్జించాయి. పాంగాంగ్‌ సరస్సు దక్షిణ భాగంలోని ఉన్నత శిఖరాలను స్వాధీనం చేసుకున్న భారత సైనికులను బెదిరించేందుకు చైనా సైనికులు విఫలయత్నం చేశారు.



గాల్లోకి కాల్పులు జరిపి.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. అంతకుముందు ఇలాంటి ఘటన 1975లో జరిగింది. ఎల్‌ఏసీ వెంట తులుంగ్‌ లా ప్రాంతంలో చైనా సైనికులు జరిపిన కాల్పుల్లో అస్సాం రైఫిల్స్‌కు చెందిన నలుగురు భారత జవాన్లు చనిపోయారు. ఆ తర్వాత ఇరుదేశాలూ కాల్పుల విరమణ పాటిస్తూ వస్తున్నాయి. ఈ ఒప్పందాన్ని చైనా ఇప్పుడు ఉల్లంఘించింది.