చెన్నైలో చైనా అధ్యక్షుడికి ఘన స్వాగతం

  • Published By: venkaiahnaidu ,Published On : October 11, 2019 / 09:22 AM IST
చెన్నైలో చైనా అధ్యక్షుడికి ఘన స్వాగతం

చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ చెన్నై చేరుకున్నారు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ సహా పలువురు అధికారులు జిన్ పింగ్ కు ఘన స్వాగతం పలికారు. మేలతాళాలతో స్వాగతం పలికారు.ఎయిర్ పోర్ట్ నుంచి ఐటీసీ గ్రాండ్ చోళకు వెళ్లిన జిన్ పింగ్ అక్కడే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఇవాళ ఇవాళ సాయంత్రం 4గంటలకు మహాబలిపురం వెళ్లనున్నారు జిన్ పింగ్.అక్కడ ప్రధాని మోడీ జిన్ పింగ్ కు ఘనస్వాగతం పలుకుతారు. మహాబలిపురంలోని చారిత్రక కట్టడాలను,సముద్రం ఒడ్డున ఉన్న ఆలయాన్ని మోడీ,జిన్ పింగ్ లు సందర్శిస్తారు.

శనివారం మహాబలిపురంలో ఫిషర్ మెన్ కోవ్ రిసార్టులో ఇరు దేశాధినేతలు కలిసి వాణిజ్య విషయాలు,అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు. దాదాపు 6గంటలపాటు మహాబలిపురంలో మోడీ,జిన్ పింగ్ చర్చల్లో పాల్గొంటారు. అనంతరం ఇరు దేశాలు సంయుక్త మీడియా ప్రకటన విడుదల చేస్తాయి. స్థానిక తమిళ చెఫ్ లు మోడీ,జిన్ పింగ్ లకు ఇవాళ డిన్నర్ వడ్డిస్తారు.

జిన్ పింగ్ రాక సందర్భంగా తమిళనాడు ఉద్యానవన శాఖ స్వాగత ద్వారాలను పద్దేనిమిది రకాల పండ్లు,కూరగాయలతో అలంకరించింది. ఈ అలంకరణను ఉద్యానవన శాఖకు చెందిన 2వందల మంది సిబ్బంది పది గంటల పాటు శ్రమించి పూర్తి చేశారు. ఈ అలంకరణకు అవసరమైన పండ్లు,కూరగాయలను రాష్ట్రంలోని అన్ని ఫాంల నుంచి తీసుకువచ్చినట్లు ఉధ్యానవన శాఖ అదనపు డైరెక్టర్ తమిళవంధాన్  తెలిపారు.

జిన్ పింగ్ కు స్వాగతం పలికేందుకు సముద్ర తీరంలోని దేవాలయం దగ్గర అరటి చెట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రెండు దేశాల మధ్య జరగనున్న చర్చలకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో పాటుగా ,చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూవి, పాలిట్ బ్యూరో సభ్యులు రానున్నారు.భారత్ తరపున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవాల్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ లు పాల్గొననున్నారు.