గతేడాది 1.4 లక్షల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ను భారత్ లో అమ్మిన చైనా…పాతాళంలో ఇండియన్ బ్రాండ్స్

  • Published By: venkaiahnaidu ,Published On : June 23, 2020 / 09:44 AM IST
గతేడాది 1.4 లక్షల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ను భారత్ లో అమ్మిన చైనా…పాతాళంలో ఇండియన్ బ్రాండ్స్

ఒక‌వైపు భారత్‌- చైనాల మ‌ధ్య సంబంధాలు క్షీణిస్తుండ‌గా, మరోవైపు చైనా నుంచి వెలువ‌డుతున్న కొన్ని గణాంకాలు చాలా ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయి. 2019లో చైనా సుమారు రూ. 1.4 లక్షల కోట్ల విలువైన‌ ఎలక్ట్రానిక్ వస్తువులను భారత్‌లో విక్రయించినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది.

స్మార్ట్‌ఫోన్,టెలివిజన్,లాప్ టాప్,స్మార్ట్ బ్రాండ్స్ మరియు వాచీలు వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ‌కేటగిరీస్ లో ఆధిపత్యం చెలాయించడం ద్వారా ఇండియన్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ లో గతేడాది చైనా కంపెనీలు దాదాపు 1. లక్షల కోట్ల విలువైన సేల్స్ నమోదు చేసాయి.

భారతదేశంలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చైనా వాటా క్రమంగా పెరుగుతోంది. 2018లో భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 60 శాతం వాటాను చైనా కంపెనీలు ఆక్రమించాయి. ఇది 2019లో 71 శాతానికి పెరిగింది. ఇప్పుడు 2020 మొదటి త్రైమాసికంలో ఈ వాటా అమాంతం 81 శాతానికి పెరిగింది. చైనాకు చెందిన షియోమి కంపెనీ భారతదేశంలో ఫోన్ల విక్ర‌యాల్లో మొదటి స్థానంలో ఉంది. చైనీస్ బ్రాండ్లైన షియోమి, ఒప్పో, వివో మరియు రియల్మీ  లు బలపడ్డాయి.

అయితే ఇది 2018లో 9శాతం, 2019లో 1.6% వాటాతో, 2020 మొదటి త్రైమాసికంలో 1శాతం లోపు పడిపోయిన స్వదేశీ ఇండియన్  బ్రాండ్స్ కు  విచారకరమైన సమయం అని ఓ రీసెర్చ్ అనలిస్ట్ పరచిరి సింగ్ తెలిపారు. 

ఇక  చైనాయేతర  ఎంఎన్ సీల స్మార్ట్ ఫోన్ ల మార్కెట్ షేర్ భారత్ లో 2018 లో 31 శాతంగా  ఉండగా, 2019లో 27.4 శాతంగా, 2020 మొదటి క్వార్టర్ లో 18 శాతంగా  ఉంది.      

మరోవైపు భారత్ లో  స్మార్ట్ టీవీల మార్కెట్ షేర్ లో… 2018లో చైనా కంపెనీల వాటా 29శాతం, 2019లో 38శాతం, 2020 మొదటి క్వార్టర్ లో 38శాతంగా ఉంది. ఇండియా లో  స్మార్ట్ టీవీల మార్కెట్ లో  భారతీయ కంపెనీల  వాటా 2018లో 6శాతం,2019లో 9శాతం, 2020 మొదటి క్వార్టర్ లో 8.శాతంగా ఉంది. 
   
ఇదిలావుంటే తాజాగా చైనా కంపెనీల వ్యాపారానికి అడ్డుక‌ట్ట వేసేందుకు మోడీ  ప్రభుత్వం కొన్ని సుంకాలను విధించడానికి సిద్ధమవుతోంది. అలాగే జాతీయ భద్రతకు అడ్డంకిగా ఉన్న చైనా కంపెనీల‌ను నిషేధించేందుకు స‌న్నాహాలు చేస్తోంది. అదే సమయంలో షియోమి, వివో, ఒప్పో త‌దిత‌ర‌ ప్రైవేట్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలపై ఇప్ప‌ట్లో ఈ ప్ర‌భావం ఉండ‌బోద‌ని అంటున్నారు.