China Spy..Woman Arrested In Delhi : నేపాలి బౌద్ధ సన్యాసి ముసుగులో ఢిల్లీలో తిష్టవేసిన చైనా మహిళ అరెస్ట్ .. చైనా గూఢాచారా?

నేపాలి బౌద్ధ సన్యాసి ముసుగులో ఢిల్లీలో తిష్టవేసిన చైనా మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఆమె చైనా గూఢాచారా? అనే అనుమానాలు వ్యక్తమవుతోంది.

China Spy..Woman Arrested In Delhi :  నేపాలి బౌద్ధ సన్యాసి ముసుగులో ఢిల్లీలో తిష్టవేసిన చైనా మహిళ అరెస్ట్ .. చైనా గూఢాచారా?

China Spy..Woman Arrested In Delhi :  భారత్ పై కుట్రలు పన్నే చైనా ఆ దిశగా కుట్రలు చేస్తోందా? భారత్ లోకి తన గూఢాచారులను పంపించిందా? కుట్రలు చేయటానికి రెక్కీ లు నిర్వహిస్తోందా? అంటే ఢిల్లీలో చైనాకు చెందిన ఓ మహిళ బౌద్ధ సన్యాసినిలా మారిన వైనం పలు అనుమానాలకు తావిస్తున్న క్రమంలో నిజమేననిస్తోంది. చైనాకు చెందిన ఓ మహిళ పేరు మార్చుకుని నకిలి గుర్తింపు కార్డులతో బౌద్ధ సన్యాసిని వేషంలో ఉన్న ఓ మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. చైనాలోని హెనాన్ ప్రావిన్సుకు చెందిన ‘కై రువో’ అనే మహిళ బౌద్ధ సన్యాసిని ముసుగులో ఢిల్లీలో తిష్ట వేసినట్లుగా గుర్తించారు. ఆమె పేరును ’డాల్మా లామా’మార్చుకుని ఢిల్లీలో నివసిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఢిల్లీ పోలీసులు.

ఉత్తర ఢిల్లీలోని డిటెటన్ శరణార్ధుల కాలనీ అయిన మజ్నుకా తిలాలో బౌద్ధ సన్యాసిని వేషధారణలో ఉన్న ఆమెను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి డోల్మా లామా పేరుతో నేపాల్ పౌరసత్వ దృవీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఫారిన్స్ రీజినల్ రిజస్ట్రేషన్ కార్యాలయంలో ఆమెను విచారించిన సమయంలో సదరు మహిళ చైనా పౌరురాలిగా నిర్ధారణ అయ్యింది. ఆమె 2019లో భారత్ కు వచ్చినట్లుగా తేలింది.

చైనా చెందిన ఆమె నేపాల్ పౌరసత్వ దృవీకరణ పత్రాలు ఉండటం..2019నుంచి భారత్ లోనే ఉండటం ఇలా పలు కోణాల్లో నిర్ధారణ కావటంతో ఆమె చైనా గూఢాచారి అనే పలు అనుమానాలు రేకెత్తున్న క్రమంలో ఆమెను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఆమెపై ఐపీసీ 120బి(నేర పూరిత కుట్ర)419 (వ్యక్తిగతంగా మోసం చేయటం)420 (చీటింగ్),467 సెక్యూరిటీ ఫోర్జరీ చేయటం) వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పలు కోణాల్లో విచారిస్తున్నారు. ఆమె గుర్తింపు కార్డులో నేపాల్ రాజధాని ఖట్మండు అడ్రస్ ఉందని పోలీసులు తెలిపారు. ఆమెను విచారిస్తున్న సమయంలో తనను చైనా కమ్యూనిస్టు పారటీలోని కొంతమంది నేతలు చంపాలని చూస్తున్నారని అందుకే ఇలా ఇక్కడ తలదాచుకున్నానని చెబుతోంది. కానీ అవేవి నమ్మదగినట్లుగా లేవని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఆమె ఇంగ్లీష్, నేపాలి, చైనీస్ భాషల్లో మాట్లాడుతోంది.