Supreme Court: సినిమా హాళ్లకు బయటి ఫుడ్ తీసుకెళ్లొచ్చా.. సుప్రీం కోర్టు తీర్పు ఇదే!

సినిమా హాళ్లకు బయటి ఫుడ్ తీసుకురాకుండా నియంత్రించే హక్కు థియేటర్ల యాజమాన్యాలకు ఉంటుందని స్పష్టం చేసింది. సినిమా హాళ్లలో ఇచ్చే ఫుడ్ మాత్రమే కాకుండా, బయటి ఫుడ్ కూడా తినేందుకు అనుమతిస్తూ జమ్ము-కాశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Supreme Court: సినిమా హాళ్లకు బయటి ఫుడ్ తీసుకెళ్లొచ్చా.. సుప్రీం కోర్టు తీర్పు ఇదే!

Supreme Court: సినిమా హాళ్లకు బయటి నుంచి ఫుడ్ తీసుకెళ్లేందుకు అనుమతించాలనే విషయంలో చాలా కాలంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సినిమా హాళ్లలోకి బయటి ఫుడ్ అనుమతించాలని ప్రేక్షకులు కోరుతుంటే, యాజమాన్యాలు దీనికి నిరాకరిస్తున్నాయి.

Bengaluru: యూనివర్సిటీలో యువతి హత్య.. పెళ్లికి ఒప్పుకోనందుకు కత్తితో పొడిచి చంపిన యువకుడు

ఈ అంశంపై అనేక సందర్భాల్లో కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. తాజాగా ఇదే అంశంపై దాఖలైన ఒక పిటిషన్‌పై సుప్రీం కోర్టు స్పందించింది. సినిమా హాళ్లకు బయటి ఫుడ్ తీసుకురాకుండా నియంత్రించే హక్కు థియేటర్ల యాజమాన్యాలకు ఉంటుందని స్పష్టం చేసింది. సినిమా హాళ్లలో ఇచ్చే ఫుడ్ మాత్రమే కాకుండా, బయటి ఫుడ్ కూడా తినేందుకు అనుమతిస్తూ జమ్ము-కాశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ ఆధ్వర్యంలోని సుప్రీం బెంచ్ దీనిపై తాజా నిర్ణయం వెలువరించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Gayathri Raghuram: అన్నామలై నాయకత్వంలో మహిళలకు రక్షణ లేదు: తమిళనాడు నేత గాయత్రి రఘురాం

‘‘హెల్దీ ఫుడ్ అందించడానికి సినిమా హాల్స్ జిమ్స్ కావు. అవి వినోదానికి సంబంధించిన కేంద్రాలే. ప్రైవేటుగా నిర్వహిస్తున్న సంస్థలు. థియేటర్ల మీద పూర్తి హక్కు యాజమాన్యాలకే ఉంటుంది. సినిమా హాళ్లలో బయటి ఫుడ్ అనుమతించే విషయంలో జమ్ము-కాశ్మీర్ హైకోర్టు పరిధి దాటి ప్రవర్తించింది. ఇప్పటికే థియేటర్ల విషయంలో కొన్ని ఆదేశాలున్నాయి. పిల్లలతోపాటు అందరికీ మంచి నీళ్లు అందించాలని ఆదేశాలున్నాయి. ఒక సినిమాను ఏ థియేటర్లో చూడాలో నిర్ణయించుకునే హక్కు ప్రేక్షకుడికి ఉంటుంది. అలాగే తమ థియేటర్లలో రూల్స్ నిర్ణయించే హక్కు కూడా యాజమాన్యాలకి ఉంటుంది. బయటి నుంచి ప్రేక్షకులు ఆహారం తీసుకురాకుండా నియంత్రించే హక్కు థియేటర్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు ఉంది. ఈ నిబంధన లేకుంటే ప్రేక్షకులు థియేటర్లకు జిలేబీ తీసుకొస్తారు.

వారి చేతికి అంటుకున్న పానకాన్ని సీట్లకు తుడుస్తారు. దీన్ని తుడిచేందుకు యాజమాన్యానికి అదనంగా ఖర్చవుతుంది. అదంతా ఎవరు భరిస్తారు? అలాగే బయటి నుంచి తందూరి చికెన్ తెచ్చుకుని తింటే అక్కడ పడిపోయిన ఎముకల్ని ఎవరు క్లీన్ చేస్తారు? అది ఇతరులకు కూడా ఇబ్బందే’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.