రూ. 4వేలకే రెమ్‌డెసివిర్‌ జనరిక్‌ వెర్షన్ మెడిసిన్

  • Published By: vamsi ,Published On : July 9, 2020 / 06:49 AM IST
రూ. 4వేలకే రెమ్‌డెసివిర్‌ జనరిక్‌ వెర్షన్ మెడిసిన్

దేశంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రముఖ ఫార్మాసీ కంపెనీ సిప్లా కోవిడ్‌ రోగుల కోసం జనరిక్‌ రెమ్‌డెసివిర్‌ మెడిసిన్‌ని మార్కెట్‌లో విడుదల చేసింది. అంతేకాదు.. దీనిని చాలా తక్కువ మార్కెట్లోకి తీసుకుని వచ్చింది.

‘సిప్రెమి’ పేరుతో విడుదల చేసిన ఈ ఔషధం ధర రూ.4,000. తొలి నెలలోనే 80 వేల వయల్స్‌ సరఫరా చేయనున్నట్లు కంపెనీ చెప్పింది. అందరికీ అందుబాటులో ఉండేలా తమ జనరిక్‌ రెమ్‌డెసివిర్‌ 100 ఎంజీ వయల్‌ ధర రూ.4,000గా నిర్ణయించినట్లు కంపెనీ సీఈఓ నిఖిల్‌ చోప్రా ప్రకటించారు.

ప్రపంచం మొత్తం మీద ఇదే అతి తక్కువ ధర అని ఆయన చెప్పారు. ప్రస్తుతం జనరిక్‌ వెర్షన్‌ ఇదే ఔషధాన్ని హైదరాబాద్‌కు చెందిన హెటిరో రూ.5,400 చొప్పున, మైలాన్‌ కంపెనీ రూ.4,800 చొప్పున అమ్ముతున్నాయి. అయితే ప్రస్తుతానికి ప్రభుత్వ మరియు ఆసుపత్రి మార్గాల ద్వారా మాత్రమే ఈ మెడిసిన్ లభిస్తుంది.

“ఈ అవసరమైన సమయంలో సమాజానికి మద్దతు ఇచ్చే ప్రయత్నాల్లో భాగంగా తక్కువ ఖర్చుతో మందును సిప్లా కంపెనీ తీసుకుని వచ్చింది” అని చోప్రా చెప్పారు. అత్యవసర మరియు అపరిమితమైన వైద్య అవసరాన్ని పరిగణనలోకి తీసుకొని వేగంగా దేశంలో అత్యవసర వినియోగం కోసం సిప్రెమిని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డిసిజిఐ) ఆమోదించింది.