Moderna’s Covid Vaccine : మోడెర్నా వ్యాక్సిన్ దిగుమతి..సిప్లాకి DCGI గ్రీన్ సిగ్నల్

భారత్ లో పరిమిత అత్యవసర వినియోగం కోసం మెడెర్నా కోవిడ్ వ్యాక్సిన్ ను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేందుకు ముంబై ప్రధానకేంద్రంగా పనిచేసే ఫార్మా దిగ్గజ కంపెనీ సిప్లాకు డీసీజీఐ(Drugs Controller General of India)అనుమతిచ్చింది.

Moderna’s Covid Vaccine : మోడెర్నా వ్యాక్సిన్ దిగుమతి..సిప్లాకి DCGI గ్రీన్ సిగ్నల్

Cipla 2

Moderna’s Covid Vaccine భారత్ లో పరిమిత అత్యవసర వినియోగం కోసం మెడెర్నా కోవిడ్ వ్యాక్సిన్ mRNA-1273ని అమెరికా నుంచి దిగుమతి చేసుకునేందుకు ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేసే ఫార్మా దిగ్గజ కంపెనీ సిప్లాకు డీసీజీఐ(Drugs Controller General of India)అనుమతిచ్చింది. మోడెర్నా వ్యాక్సిన్ దిగుమతి కోసం సిప్లా కంపెనీ సోమవారG డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

తాజాగా డీసీజీఐ..మోడెర్నా వ్యాక్సిన్ దిగుమతి కోసం సిప్లాకి అనుమతివ్వడంతో భారత్ లో అందుబాటులోకి రానున్న నాలుగో కోవిడ్ వ్యాక్సిన్ గా ఇది నిలవనుంది. భారత్ లో ఇప్పటికే సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్,భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్,రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.

కాగా, అమెరికాకి చెందిర మోడెర్నా కంపెనీ.. ఆ దేశంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్(NIAID)మరియు ది బయోమెడికల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ డెలవప్ మెంట్ అథారిటీ(BARDA)సహకారంతో కోవిడ్ వ్యాక్సిన్ mRNA-1273ని అభివృద్ధి చేసింది. అమెరికాలో స్పైకివాక్స్ పేరుతో మోడెర్నా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాక్సిన్ కోవిడ్ 90 శాతం స‌మ‌ర్థవంతంగా ప‌ని చేస్తున్నట్లు మోడెర్నా తేలింది. అమెరికాతో పాటు పలు సంపన్న దేశాలు కూడా మోడెర్నా టీకాకు ఇప్పటికే అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేశాయి.