ఎంత మంచి పెళ్లికొడుకు : 11.లక్షలు వద్దు 11రూపాయలు చాలు

  • Edited By: veegamteam , November 15, 2019 / 06:32 AM IST
ఎంత మంచి పెళ్లికొడుకు : 11.లక్షలు వద్దు 11రూపాయలు చాలు

పెళ్లి అనగానే ముందు కట్నం ఎంత ఇస్తారో కనుక్కోండి అని అంటున్నారు. వారిచ్చే కట్నాన్ని బట్టి పెళ్లి ఖాయం చేసుకుంటారు. కట్నం ఒక రూపాయి తక్కువ ఇచ్చిన పెళ్లికి నానా హంగామా చేస్తుంటారు. మరి అలాంటి రోజుల్లో ఓ జవాను మాత్రం రూ. 11 లక్షలకు ఇస్తుంటే.. వద్దని రూ. 11 కట్నంగా తీసుకున్నాడు. మరి అంత డబ్బు ఎందుకు వద్దనుకున్నాడు? అసలు విషయం తెలుసుకోవాలంటే వార్త చదవాల్సిందే.

జైపూర్‌ కు చెందిన జితేంద్ర సింగ్‌.. సెంట్రల్ ఇండస్ట్రియల్ ఫోర్స్  (CISF) జవానుగా పని చేస్తున్నాడు. ఇతను ఒక అమ్మాయిని ఈ నెల (నవంబర్ 8, 2019)న వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు కట్నం కింద వరుడికి రూ. 11 లక్షలు ఇస్తుంటే… వరుడు వెంటనే వద్దనేశాడు.  

తాను పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆఫ్ లా పూర్తి చేసింది. ప్రస్తుతం డాక్టరేట్ చేస్తుంది. అంతేకాకుండా రాజస్థాన్‌ జ్యుడిషీయల్‌ సర్వీసెస్‌కు ప్రిపేర్‌ అవుతుంది. ఒక వేళ ఆమె జ్యుడిషీయల్‌ సర్వీసెస్‌లో ఉద్యోగం సంపాదిస్తే.. అదే మాకు పెద్ద సంపాదన, ఈ డబ్బు మాకు వద్దు అని వరుడు పేర్కొన్నాడు. దీంతో వదువు తండ్రికి సంతోషంతో కన్నీళ్లు వచ్చాయి.

అమ్మాయి తండ్రి మాట్లాడుతూ.. మాకు కాబోయే అల్లుడు తనకు ఇచ్చిన డబ్బును వద్దని చెప్పడంతో నేను చాలా బయపడ్డాను, కాసేపటి వరకు షాక్ లో ఉండిపోయానని అమ్మాయి తండ్రి గోవింద్ సింగ్ అన్నారు. కట్నం తీసుకోకపోయేసరికి కొంచెం ఇబ్బంది కలిగింది. పెళ్లి ఏర్పాట్లు సరిగా చేయనందుకు కట్నం వద్దంటున్నారని అనుకున్నాం. కానీ వరుడి కుటుంబం కట్నం తీసుకోటానికి ఇష్టపడట్లేదని తెలిసి చాలా సంతోషంగా అనిపించిందని గోవింద్‌ సింగ్‌ చెప్పాడు.