Pollution: Be Careful.. తీవ్రంగా వాయు కాలుష్యం.. వారు బయటకు రావొద్దు

దేశంలో దీపావళి తర్వాత పెద్ద నగరాల్లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది.

Pollution: Be Careful.. తీవ్రంగా వాయు కాలుష్యం.. వారు బయటకు రావొద్దు

Pollution

Pollution: దేశంలో దీపావళి తర్వాత పెద్ద నగరాల్లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ దేశంలోని అత్యంత కాలుష్య నగరాల్లో మొదటి స్థానంలో ఉండగా.. ఇక్కడ AQI 477 నమోదైంది.

ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పీఎం 2.5పై సగటున AQI 448గా ఉంది. దేశంలోని అత్యంత కాలుష్య నగరాల్లో టాప్-5లో ఉన్న ఐదు నగరాలు ఉత్తరప్రదేశ్‌కు చెందినవే. అదే సమయంలో, ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది నగరాలు టాప్ 10లో ఉన్నాయి.

ఎన్‌సీఆర్‌ పరిధిలోని ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్‌ల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. నిషేధం అమలులో ఉన్నప్పటికీ దీపావళి రోజున ప్రజలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.

పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం కూడా మరో కారణం. ప్రస్తుతం వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. వాయు కాలుష్యం వల్ల ప్రజలు కళ్లు, గొంతు మంట వంటి సమస్యలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు.

తక్కువ ఉష్ణోగ్రతలు, కాలుష్య కారకాలు పేరుకుపోవడంతో విజబిలిటీ కూడా ఆయా ప్రాంతాల్లో దారుణంగా ఉంది. ఢిల్లీలోని జన్‌పథ్‌లో వాయు నాణ్యత ప్రమాదకర పీఎం 2.5 స్థాయి 625కి చేరుకుంది. ప్రమాణాల ప్రకారం, పీఎం 2.5 స్థాయి 380 కంటే ఎక్కువగా ఉంటే తీవ్రమైందిగా పరిగణిస్తారు.

ఢిల్లీలో దీపావళి తర్వాత రోజున 2016లో 445, 2017లో 403, 2018లో 390, 2019లో 368, 2020లో 435, 2021లో 462 వాయుకాలుష్య తీవ్రత నమోదైంది.

శ్వాస సంబంధ, హృద్రోగ సమస్యలు ఉన్నవారిపై వాయుకాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతుంది. వారు బయట తిరక్కపోవడమే మంచిదిగా అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా మార్నింగ్ వాక్ కోసం బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

Read More:

Covaxin: ఇండియన్ ట్రావెలర్స్‌కి గుడ్ న్యూస్.. బ్రిటన్‌లో కొవాగ్జిన్‌కి ఆమోదం 

Children’s Hospital: ఆసుపత్రిలో పిల్లల వార్డులో మంటలు.. నలుగురు మృతి