మీ వేడుకులకు మేం రాం : పాక్ నేషనల్ డే బహిష్కరించిన భారత్

  • Published By: venkaiahnaidu ,Published On : March 22, 2019 / 09:41 AM IST
మీ వేడుకులకు మేం రాం : పాక్ నేషనల్ డే బహిష్కరించిన భారత్

పాక్ నేషనల్ డేను భారత్ బహిష్కరించింది.ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమీషన్ లో శుక్రవారం(మార్చి-22,2019)జరిగే పాకిస్థాన్ నేషనల్‌ డే వేడుకలకు భారత ప్రభుత్వం తరఫున ఏ అధికారి వెళ్లడం లేదు. ఈ కార్యక్రమానికి కాశ్మీర్ వేర్పాటువాద నేతలను పాక్ ఆహ్వానించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతి ఏటా మార్చి-23న జరిగే ఈ వేడుకలను ఈ సారి ఢిల్లీ హైకమీషన్ ఒకరోజు ముందుగానే జరుపుకుంటోంది.భారత్‌ తరఫున ఒక కేంద్ర మంత్రి ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరు కావడం ఆనవాయితీగా వస్తోంది.
Read Also : సొంతమామనే కుట్రచేసి చంపిన వ్యక్తి చంద్రబాబు : జగన్

గడిచిన ఐదేళ్లుగా ఈ వేడుకలకు పాక్ హైకమీషన్ వేర్పాటువాద నేతలను ఆహ్వానిస్తున్నప్పటికీ భారత్ ఎప్పుడూ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించలేదు.వేర్పాటువాదనేతలు హాజరయినప్పటికీ కూడా బహిష్కరించని భారత్..కొద్ది రోజులుగా రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా కొన్ని నెలలుగా పాక్ లోని భారత హైకమీషన్ అధికారులను పాక్ ప్రభుత్వం వేధింపులకు గుర్తిచేస్తున్న విషయం తెలిసిందే.ఈ విషయంపై భారత్ కూడా సీరియస్ గానే స్పందించింది.ఇటువంటి సమయంలో పాక్ హైకమీషన్ లో వేడుకలకు వెళ్లకపోవడమే కరెక్ట్ అని ప్రభుత్వం భావించింది
Read Also : ఎన్నిక‌ల టైంలో ఐటీ రైడ్స్ ఎలా చేస్తారు : ఈసీకి శివాజీ కంప్ల‌యింట్