సవరణ సెగలు : ఢిల్లీలో భారీ ర్యాలీలు..ఎర్రకోట వద్ద భారీ బందోబస్తు

  • Published By: madhu ,Published On : December 19, 2019 / 06:03 AM IST
సవరణ సెగలు : ఢిల్లీలో భారీ ర్యాలీలు..ఎర్రకోట వద్ద భారీ బందోబస్తు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు పెల్లుబికుతున్నాయి. 2019, డిసెంబర్ 19వ తేదీ గురువారం ఢిల్లీలో లెఫ్ట్ పార్టీలు, విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ చేపట్టాయి. పౌర సంఘాలు, సామాజిక కార్యకర్తలు కూడా మరో ర్యాలీ చేపట్టాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఢిల్లీ పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. హింసాత్మక ఘటనలు జరుగకుండా భారీగా పోలీసులు మోహరించారు. జామియా నుంచి జంతర్ మంతర్ వరకు నడుచుకుంటూ నిరసన చేపట్టాలని, మధ్యాహ్నం 3 గంటలకు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టాలని నిర్ణయించారు.

దీంతో ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా 7 మెట్రో స్టేషన్లను మూసివేసింది. విద్యార్థులు ఎక్కువ మెట్రో స్టేషన్లను ఉపయోగించుకొంటారని భావించిన పోలీసులు స్టేషన్లను మూసివేశారు. ఎర్రకోట వద్దకు భారీగా విద్యార్థులు, ఇతరులు తరలివచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశార. దీంతో అక్కడ 144 సెక్షన్ అమల్లో పెట్టారు. 

* జామియా యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. 
* ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో ఇంటర్ నెట్ డౌన్. 
* ఢిల్లీ ఎర్రకోట వద్ద భారీగా పోలీసుల మోమరింపు. 
 

* హైదరాబాద్‌లో ర్యాలీకి వామపక్షాల పిలుపు.
* చార్మినార్ నుంచి ఎగ్జీబీషన్ గ్రౌండ్ వరకు ర్యాలీ. 
* ఆందోళనలకు అనుమతి లేదన్న పోలీసులు. 
* ఎగ్జిబీషన్ గ్రౌండ్ వద్ద విద్యార్థుల అరెస్టు. 

పోలీసులు వాళ్లపై లాఠీలు ఝుళిపించడంతో ఢిల్లీ యుద్ధభూమిని మరిపించింది. ఆందోళనకారులు బస్సులకు నిప్పు పెట్టారు. అగ్నిమాపక వాహనాలను ధ్వసం చేసి.. బీభత్సం సృష్టించారు. జనవరి 05 వరకు జామియా యనివర్శిటీ మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. పౌరసత్వ చట్ట.. వ్యతిరేక జ్వాలలు దేశ రాజధానిని దహించి వేస్తున్నాయి. ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.

జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. పోలీసులు వాళ్లపై లాఠీలు ఝుళిపించడంతో ఢిల్లీ యుద్ధభూమిని మరిపించింది. ఆందోళనకారులు బస్సులకు నిప్పు పెట్టారు. అగ్నిమాపక వాహనాలను ధ్వసం చేసి.. బీభత్సం సృష్టించడంతో కలకలం రేగింది. టియర్ గ్యాస్  షెల్స్ ప్రయోగించారు. ఘర్షణల్లో 35మంది  విద్యార్థులు, ఆరుగురు పోలీసులకు గాయాలయ్యాయి.