CJI Bobde : అయోధ్య వివాదం..షారూఖ్ మధ్యవర్తిత్వం, ఏమి జరిగింది ?

రామజన్మభూమి వివాదంలో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మధ్యవర్తిత్వం వహించారా ? దీనిపై సుప్రీంకోర్టు బార్ అసోయేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

CJI Bobde : అయోధ్య వివాదం..షారూఖ్ మధ్యవర్తిత్వం, ఏమి జరిగింది ?

Shah Rukh Khan

Shah Rukh Khan : దశాబ్దాలుగా దేశంలో రాజకీయ వివాదాలకు కారణంగా.. హిందూ ముస్లింల మధ్య ఐక్యతకు విఘాతంగా మారిన అయోధ్య వివాదం ఎట్టకేలకు ముగిసింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని హిందువులకు అప్పగిస్తూ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే..రామజన్మభూమి వివాదంలో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మధ్యవర్తిత్వం వహించారా ? దీనిపై సుప్రీంకోర్టు బార్ అసోయేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బాబ్డే పదవీ విరమణ సందర్భంగా వర్చువల్ వీడ్కోలు జరిగింది.

అయోధ్య వివాదంలో షారూఖ్ ఖాన్ మధ్యవర్తిత్వం ప్యానెల్ లో ఉంటారా ? అని జస్టిస్ బాబ్డే అడిగారని, తాను షారూఖ్ తో మాట్లాడినట్లు చెప్పారు. కానీ..మధ్యవర్తిత్వం ఫెయిల్ అయ్యిందన్నారు. ఈ సమయంలో అక్కడ జస్టిస్ బాబ్డే ఉండడం విశేషం. హార్లీ డైవిడ్సన్ బైక్ చాలా ఇష్టమని, ఎందుకు అమ్ముతావు…తనకు పంపించాలని బాబ్డే అన్నారని తెలిపారు. చాలా బరువు ఉంటుందని, మీకు ఎందుకని అడిగినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు తొలుత ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానల్ ను అయోధ్య వివాదంలో మధ్యవర్తిత్వానికి నియమించింది.

అందులో జస్టిస్ కలీపుల్లా, అధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవి శంకర్, సీనియర్ లాయర్ శ్రీరాంపంచులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. చాలాసార్లు చర్చలు జరిపారు. కానీ ఇందులో ఎలాంటి ఫలితం రాలేదు. 2019లో సుప్రీంకోర్టు అయోధ్య స్థలాన్ని రామ మందిర నిర్మాణానికి అప్పగిస్తూ..నిర్ణయం తీసుకుంది. మసీదు నిర్మాణం కోసం ముస్లింలకు ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని తీర్పును వెలువరించింది.

Read More : HUBBALLI : ఇంత కిరాతకమా ? కన్నడ నటి సోదరుడు హత్య కేసులో షాకింగ్ నిజాలు