లైంగిక వేధింపుల కేసులో సీజేఐకి క్లీన్ చిట్

  • Published By: venkaiahnaidu ,Published On : May 6, 2019 / 11:59 AM IST
లైంగిక వేధింపుల కేసులో సీజేఐకి క్లీన్ చిట్

లైంగిక వేధింపుల కేసులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగొయ్ కి సోమవారం(మే-6,2019) సుప్రీంకోర్టు అంతర్గత విచారణ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది.తనను గొగొయ్ లైంగికంగా వేధించారంటూ సుప్రీం కోర్టు మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని జస్టిస్ ఏఎస్ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్యధర్మాసనం నిర్థారించింది.

 చీఫ్ జస్టిస్ కాకముందు గొగోయ్‌ కు జూనియర్ అసిస్టెంట్‌ గా ఉన్న మహిళ ఆయనపై ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తర్వాత తనను, తన భర్తను, ఇతర కుటుంబ సభ్యులను బాధితులుగా మార్చారని ఆమె కంప్లెయింట్ చేశారు. ఈ ఆరోపణలపై జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే అధ్యక్షతన ఏర్పాటైన అంతర్గత విచారణ కమిటీలో ఇందు మల్హోత్ర,ఇందిరా బెనర్జీలు సభ్యులుగా ఉన్నాయి.గొగొయ్ పై వచ్చిన ఆరోపణలల్లో వాస్తవం లేదంటూ త్రిసభ్యధర్మాసనం కొట్టిపారేసింది.