CJI U U Lalit: రేపు సుప్రీం కోర్టు విచారణ లైవ్ స్ట్రీమింగ్.. సీజేఐ లలిత్ రిటైర్మెంట్ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు

సుప్రీంకోర్టు విచారణను సోమవారం లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ చివరి పని రోజు సందర్భంగా ఈ ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.

CJI U U Lalit: రేపు సుప్రీం కోర్టు విచారణ లైవ్ స్ట్రీమింగ్.. సీజేఐ లలిత్ రిటైర్మెంట్ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు

CJI U U Lalit: సుప్రీంకోర్టులో కేసు విచారణను సోమవారం లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బెంచ్ ఆధ్వర్యంలో జరిగే విచారణను లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి ప్రత్యేక కారణం ఉంది.

Munugode: ‘మునుగోడు’లో టీఆర్ఎస్ గెలుపు.. రెండో స్థానంలో బీజేపీ.. డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్

ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం జస్టిస్ యూయూ లలిత్‌కు చివరి రోజు. దీంతో న్యాయమూర్తిగా తన చివరిరోజు విచారణను జస్టిస్ లలిత్ లైవ్ స్ట్రీమింగ్ చేయాలనుకున్నారు. ఇక ఈ బెంచ్‌లో జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ బెలా ఎమ్ త్రివేది కూడా ఉన్నారు. గత ఆగష్టులో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చివరి పని రోజున కూడా ఇలాగే లైవ్ స్ట్రీమింగ్ చేశారు. తాజా లైవ్ స్ట్రీమింగ్ సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమవుతుంది. సుప్రీంకోర్టు వెబ్ క్యాస్ట్ చానెల్‪తోపాటు, యూట్యూబ్ ఛానెల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. మరోవైపు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేయబోతున్న జస్టిస్ యూయూ లలిత్ మీడియాతో మాట్లాడారు.

Munugode Bypoll Results: ‘సెమీఫైనల్‌’లో టీఆర్ఎస్ సక్సెస్.. ఇక ఫోకస్ అంతా ‘ఫైనల్‌’పైనే

తన పనితీరు విషయంలో సంతృప్తితో ఉన్నట్లు చెప్పారు. ‘‘ఈ రంగంలో 39 ఏళ్లుగా పని చేస్తున్నాను. నిజాయితీగా చెప్పాలంటే ప్రతి రోజూ నా వృత్తిని ఆస్వాదించాను. న్యాయవ్యవస్థలోని అన్ని దశల్ని చూశాను. అటు న్యాయవాదిగా.. ఇటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశాను. ఈ రంగంలోని అన్ని కోణాల్ని పరిశీలించాను. నేను సాధించినదాని విషయంలో పూర్తి సంతృప్తితో ఉన్నాను’’ అని జస్టిస్ యూయూ లలిత్ అన్నారు.