Kolhapur: నిన్న కర్ణాటకలో టిప్పు సుల్తాన్, నేడు మహారాష్ట్రలో ఔరంగాజేబ్.. కొల్హాపూర్ పట్టణంలో హింసాత్మక ఘర్షణలు

ఔరంగజేబును పొగిడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఇలాంటి చర్యలను సహించబోమన్నారు. శాంతిభద్రతలను కాపాడాలని ఫడ్నవీస్ నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఔరంగజేబును కీర్తిస్తూ ఫొటో లేదా పోస్టర్ పెడితే శాంతిభద్రతలపై దాడి చేయాల్సిన అవసరం లేదంటే హింసకు పాల్పడాల్సిన అవసరం ఏముందంటూ శరద్ పవార్ ప్రశ్నించారు.

Kolhapur: నిన్న కర్ణాటకలో టిప్పు సుల్తాన్, నేడు మహారాష్ట్రలో ఔరంగాజేబ్.. కొల్హాపూర్ పట్టణంలో హింసాత్మక ఘర్షణలు

Aurangzeb: కొద్ది రోజుల క్రితం వరకు కర్ణాటక రాష్ట్రంలో కొనసాగిన టిప్పు సుల్తాన్ వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయంగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల మధ్య బాహాబాహీకి దారి తీసింది. ఇక ఆ గొడవ మీద రాష్ట్రంలో జరిగిన హడావుడి, హింసాత్మక సంఘటనలకు కొదువే లేదు. ఇప్పుడిప్పుడే కర్ణాటకలో ఆ పరిస్థితులు కాస్త సద్దుమణిగినట్లు కనిపిస్తున్నాయి. అంతలోనే పక్క రాష్ట్రం మహారాష్ట్రలో ఇలాంటి వివాదాలు పైకి లేచాయి. కర్ణాటక సరిహద్దుకు సమీపంలో ఉన్న కొల్హాపూర్ పట్టణంలో బుధవారం హింసాత్మక ఘటనలు చెలరేగాయి.

Sandstorm: రాజస్థాన్‭లో 80 అడుగుల ఎత్తులో భయంకరమైన ఇసుక తుఫాను

ఔరంగజేబ్‌ను కీర్తిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌పై రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఔరంగజేబును కీర్తిస్తూ పోస్ట్ పెట్టిన యువకుడిని రైట్ వింగుకు చెందిన కొందరు విపరీతంగా కొట్టారు. అనంతరం ఇరు వర్గాల మధ్య ఘర్షణ పెద్దగా మారింది. ఇరు వర్గాలు రోడ్లపైకి వచ్చి హంగామా చేశారు. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు, కర్రలతో కొట్టుకున్నారు. పరిస్థితి విషయమించడంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. లాఠీచార్జ్ చేసి నిరసనకారుల్ని చెదరగొట్టారు.

Karnataka : ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు 50 శాతం సీట్ల కేటాయింపు .. సిద్దూ సర్కార్ వినూత్న నిర్ణయం

ఈ విషయమై కొల్హాపూర్ ఎస్పీ మహేంద్ర పండిట్ మాట్లాడుతూ ‘‘మంగళవారం వాట్సాప్ గ్రూప్‌లో ఔరంగజేబును ప్రశంసిస్తూ ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. దీనికి నిరసనగా హిందూ సంస్థలు బుధవారం కొల్హాపూర్ బంద్ ప్రకటించాయి. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశాం’’ అని అన్నారు. పండిట్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని దసరా చౌక్, టౌన్ హాల్, లక్ష్మీపుర తదితర ప్రాంతాల్లో ఈరోజు సంస్థలు రాళ్లు రువ్వుతూ ప్రదర్శనలు చేశాయి. దీంతో జిల్లావ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వెంటనే లాఠీచార్జి చేసి జనాన్ని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Minister KTR : 17వేల ఎకరాల పోడు భూములకు పట్టాలివ్వబోతున్నాం.. కాంగ్రెసోళ్ల మాటలకు మోసపోవద్దు

ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని మహేంద్ర పండిట్ తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదని, లక్ష్మీపుర పోలీస్ స్టేషన్‌లో వాట్సాప్ పోస్ట్‌కు సంబంధించి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదైందని చెప్పారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, జూన్ 19 వరకు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించినట్లు పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవల్ని సైతం నిలిపివేశారు.

Gautam Adani: అదానీ ఆస్తులు మళ్లీ పెరిగుతున్నాయి.. మరోసారి ఆసియా సంపన్న జాబితాలో నెం.2కి వచ్చిన అదానీ

ఔరంగజేబును పొగిడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఇలాంటి చర్యలను సహించబోమన్నారు. శాంతిభద్రతలను కాపాడాలని ఫడ్నవీస్ నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా శాంతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ.. ఎవరైనా ఔరంగజేబును కీర్తిస్తూ ఫొటో లేదా పోస్టర్ పెడితే శాంతిభద్రతలపై దాడి చేయాల్సిన అవసరం లేదంటే హింసకు పాల్పడాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించారు. అధికార పార్టీ ఇలాంటి ధోరణులను ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు.