UP : అథ్లెట్ కావాలనే లక్ష్యం కోసం..10 ఏళ్ల బాలిక 200 కిలోమీటర్ల పరుగు..

అథ్లెట్ కావాలనే లక్ష్యం కోసం..10 ఏళ్ల బాలిక 200కిలోమీటర్ల పరుగుతో వినూత్న యత్నం చేపట్టింది.

UP : అథ్లెట్ కావాలనే లక్ష్యం కోసం..10 ఏళ్ల బాలిక 200 కిలోమీటర్ల పరుగు..

Class 4 Student Begins Over 200 Km Run To Lucknow

Class 4 student begins over 200 km run to Lucknow : ఆ చిన్నారి వయసు 10ఏళ్లు. చదివేది 4th క్లాస్. పరుగు పందెం మాత్రం 200 కిలోమీటర్లు. అథ్లెట్ కావాలన్నది ఆశయం. ఆ బాలిక పేరు కాజల్. ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్ ను కలుసుకోవటానికి కాజల్ ప్రయాగ్ రాజ్ నుంచి యూపీ రాజధాని లక్నో వరకు 200 కిలోమీటర్ల పరుగు కార్యక్రమాన్ని (మారథాన్) ఆదివారం (ఏప్రిల్ 10,2022)నుంచి ప్రారంభించింది. 17 తారీఖున సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసానికి చేరుకోనుంది.

ఈ సందర్భంగా చిన్నారి కాజల్ మాట్లాడుతూ..అథ్లెట్ కావాలనేది నా ఆశయం. అథ్లెట్ గా మారి దేశానికి పేరు తెచ్చే విషయంలో తనకు కావాల్సిన వనరుల కోసం ఈ మారధాన్ ను ప్రారంభించానని..సీఎం యోగీ తనకు సహాయం చేస్తారని ఆశపడుతున్నానని తెలిపింది. 2021లో ఇందిరా మారథాన్ పరుగు పందెంలో పాల్గొన్నానని.. అయినా జిల్లా యంత్రాంగం నుంచి, తన స్కూల్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదని వాపోయింది.

అసలే ఎండలు మండిపోతున్నాయి. అయినా కాజల్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవటానికి సీఎం కలుసుకోవటానికి ఈ పరుగుపందెం ప్రారంభించింది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు.. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకే పరుగులో పాల్గొంటుంది. మిగిలిన సమయంలో విశ్రాంతి తీసుకుంటోంది. యూపీలోని లలిత్ పూర్ కాజల్ స్వగ్రామం. కాజల్ తండ్రి పాయింట్ మెన్ గా పనిచేస్తున్నారు. కాజల్ కోచ్ రజనీకాంత్ రైల్వేలో పాయింట్ మ్యాన్ గా పనిచేస్తున్నారు. తనకు సీఎం యోగీ సహాయం చేస్తారని కాజల్ ఆశిస్తోంది.